MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కాజల్‌ తన పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుందో తెలుసా? తెలుగు ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రహస్యం వెల్లడి

కాజల్‌ తన పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుందో తెలుసా? తెలుగు ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రహస్యం వెల్లడి

కాజల్‌ అగర్వాల్‌ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ బిగ్గెస్ట్ రహస్యం బయటపెట్టింది. తెలుగు ఫ్యాన్స్ పండగ చేసుకునే విషయం వెల్లడించింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 19 2024, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల తెలుగులోకి `సత్యభామ` చిత్రంతో అలరించింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలను ఎంచుకునే విషయంలో కొంత మార్పు కనిపిస్తుంది. అందులో భాగంగా ఆమె లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడలేదు. కానీ కాజల్‌కి మంచి పేరొచ్చింది. బాగా చేసిందనే కామెంట్స్ వచ్చాయి. సెకండ్‌ ఇన్నింగ్స్ లో మరింత బిజీ అవుతుంది కాజల్‌. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ క్రమంలో కాజల్‌కి సంబంధించిన ఓ ఆరుదైన విషయం బయటకు వచ్చింది. ఆమె నాలుగేళ్ల క్రితం ముంబాయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. వీరికి కొడుకు నీల్‌ కిచ్లు కూడా జన్మించారు. అయితే కాజల్‌ తన పెళ్లిలో ఓ తెలుగు సాంప్రదాయాన్ని పాటించింది. తనది పంజాబీ ఫ్యామిలీ అయినప్పటికీ తెలుగు సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ పెళ్లిలో జిలకర్ర బెల్లం వాడింది. మన తెలుగు సంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లంని ఉపయోగిస్తామనే విషయం తెలిసిందే. అబ్బాయి, అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి పెడతారు. వాళ్లిద్దరి బంధం బలంగా ఉండాలనే అర్థంలో దాన్ని ఉపయోగిస్తుంటాం. 

37

అయితే గౌతమ్‌ కిచ్లుతో పెళ్లి సమయంలో కాజల్‌ కూడా ఈ జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. నిజానికి ఇది తమ పంజాబీ ట్రెడిషన్‌లో లేదు. కానీ కావాలని పెట్టించుకుందట కాజల్‌. అలా పెట్టుకోవడానికి కారణమేంటనేది వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెని ఆరాధించే తెలుగు అభిమానులు ఫిదా అయ్యే విషయాన్ని, పండగ చేసుకునే విషయాన్ని చెప్పింది కాజల్‌. ఇంతకి ఏం చెప్పిందంటే..

47

తనది పంజాబీ ఫ్యామిలీ అయినా, తెలుగులోనే తాను నటిగా ఎదిగాను అని, తెలుగు ఆడియెన్స్ ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. తనది పంజాబీ ఫ్యామిలీ అయినా, తెలుగు కూడా తన ఫ్యామిలీలాగే, తాను తెలుగు అమ్మాయిగానే ఫీలవుతానని, తెలుగు ఆడియెన్స్ అంతటి ప్రేమాభిమానులను ఇచ్చారని, ఇంతటి పేరు, స్థాయిని ఇచ్చారని, తమ అమ్మాయిలా ఆదరించారని చెప్పింది. అందుకే ఎప్పుడూ వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపిస్తుందని, తెలుగు ఫ్యాన్స్ కి, తెలుగు వారికి తన ట్రిబ్యూట్‌గా పెళ్లిలో ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు తెలిపింది కాజల్‌. 

57
Kajal Aggarwal

Kajal Aggarwal

కొన్నాళ్ల క్రితం సాక్షి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది కాజల్‌. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. నేడు కాజల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండటం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్‌ మాట్లాడుతూ, కోపం వస్తే తన భర్తపై అరుస్తానని తెలిపింది. అలాగే ఆయన్ని జీకే అని ముద్దుగా పిలుస్తుందట. దీంతోపాటు మరో ముద్దు పేరు ఉందని, దాన్ని బయటకు చెప్పను అని తెలిపింది కాజల్. మరోవైపు తన భర్త కాజల్ రొమాంటిక్‌ కాదని చెప్పి షాకిచ్చింది. ప్రాక్టికల్‌గా ఉంటాడని తెలిపింది. 
 

67

కాజల్‌ అగర్వాల్‌.. 2007లో `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `చందమామ` చిత్రంతో టాలీవుడ్‌ చందమామ అయిపోయింది. `మగధీర`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. హిందీ, తమిళంలోనూ సినిమాలు చేసినా, తెలుగులోనే ఎక్కువగా మూవీస్‌ చేసి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఆమె మ్యారేజ్‌ని ప్రకటించినప్పుడు ఎంతో మంది కుర్రాళ్ల హార్ట్ బ్రేక్‌ అయిన విషయం తెలిసిందే. 
 

77

సెకండ్‌ ఇన్నింగ్స్ లో `భగవంత్‌ కేసరి`, `సత్యభామ` చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో `కన్పప్ప`లో పార్వతి పాత్రలో కనిపించబోతుంది. మరోవైపు `ఇండియన్‌ 3`లో నటించింది. అలాగే హిందీలో ఓ సినిమా చేస్తుంది కాజల్‌. నేడు ఆమె 39వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved