- Home
- Entertainment
- ఛత్రపతి స్పెషల్ స్క్రీనింగ్ వద్ద భర్తతో కాజల్ హంగామా.. షార్ట్ గౌనులో బ్యూటిఫుల్ లుక్స్ వైరల్
ఛత్రపతి స్పెషల్ స్క్రీనింగ్ వద్ద భర్తతో కాజల్ హంగామా.. షార్ట్ గౌనులో బ్యూటిఫుల్ లుక్స్ వైరల్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఛత్రపతి స్పెషల్ స్క్రీనింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఛత్రపతిని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.
నేడు ఈ చిత్రం గ్రాండ్ గా హిందీలో రిలీజ్ అవుతోంది. దీనితో నిర్మాణ సంస్థ సెలెబ్రెటీలకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. దీనితో బాలీవుడ్ తారలంతా ఛత్రపతి స్పెషల్ స్క్రీనింగ్ కి తరలి వస్తున్నారు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన భర్త కిచ్లు తో కలసి బెల్లం కొండ శ్రీనివాస్ చిత్రాన్ని వీక్షించేందుకు హాజరైంది.
ఫోటోలకు ఫోజులు ఇస్తూ కాజల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షార్ట్ గౌన్ లో మెరిసిన కాజల్ మైండ్ బ్లోయింగ్ థైస్ తో విజువల్ ట్రీట్ ఇచ్చింది. కిచ్లు తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ తో కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజమౌళి స్టయిల్ అనుకరిస్తూనే ఛత్రపతి చిత్రంలో తనదైన శైలిలో వినాయక్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టినట్లు తెలుస్తోంది.
హాట్ బ్యూటీ నుస్రత్ ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ కి జోడిగా నటించింది. కాజల్ విషయానికి వస్తే ఆమె వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో నటించింది.
కాజల్ చివరగా ఘోస్టీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం కాజల్ బాలయ్య 108లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని చిత్రాలకు సైన్ చేస్తోంది.
గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది.
కాజల్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల చందమామ క్రమంగా హాట్ నెస్ పెంచుతోంది అని నెటిజన్లు అంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా కాజల్ కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.