సౌత్ మొత్తంలో కాజలే టాప్.. ఎందులో తెలిస్తే మైండ్ బ్లాంక్!
కాజల్ అగర్వాల్ ఇప్పుడు సౌత్ హీరోయిన్లందరిని వెనక్కి నెట్టేసింది. ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఎప్పటికప్పుడు అభిమానులకు, నెటిజన్లకు అందుబాటులో ఉంటూ ఇంతటి ఘనత సాధించింది. ఇంతకి కాజల్ సాధించిన ఘనత ఏంటి? ఎందులో టాప్ అనేది చూస్తే..
తాజాగా కాజల్‌ని సోషల్ మీడియాలో దాదాపు 42.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 4.2మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 14.8మిలియన్స్, 23.6మిలియన్ ఫేస్‌బుక్ కలుపుకుని ఈ అరుదైన రికార్డుని సృష్టించింది. ఈ లెక్కన ఇంతటి ఫాలోయింగ్ మరే హీరోయిన్‌కి లేకపోవడం విశేషం.
సమంత, తమన్నా, అనుష్క, నయనతార వంటి టాప్ హీరోయిన్లని సైతం కాజల్ వెనక్కి నెట్టింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు. కాజల్ తర్వాత సమంతకి ఆ స్థానం దక్కింది. కానీ దాదాపు సగంలో ఉండిపోయింది. ఆమెకి ఫాలోవర్స్ సుమారు 29మిలియన్సే కావడం గమనార్హం.
మొత్తంగా కాజల్ అందరి కంటే ఎక్కవ ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో తన హావా చూపిస్తోంది. సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపుతుందని చెప్పొచ్చు. తనకున్న ఫాలోయింగ్ ఏంటో చూపించి సత్తా చాటుతోంది.
కాజల్ ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను కనువిందు చేస్తుంది. అంతేకాదు అప్పుడప్పుడు చాటింగ్ కూడా చేస్తుంది.
దీనికితోడు కాజల్‌పై ఎలాంటి రూమర్స్ ఉండవు. డేటింగ్‌లు, రిలేషన్ వంటి వార్తలు, గాసిప్‌లకు ఛాన్సే లేదు. పూర్తిగా వాటికి దూరంగా ఉంటోంది. తెరపై గ్లామర్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
అయితే కాజల్ ఇప్పటి వరకు బలమైన పాత్రలు పోషించినవి చాలా తక్కువ. ఎక్కువగా గ్లామర్ పాత్రలతోని పక్కింటి అమ్మాయిలా, లేదంటే లవర్‌గా అలా వచ్చి ఇలా పోయే పాత్రల్లోనే మెరిసింది. దీంతోపాటు సగంసగం అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది.
కాజల్ ఇటీవల `సీత` చిత్రంలో మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించింది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కాజల్ నప్పదనే కామెంట్‌ని ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే కాజల్ ఐటెమ్ సాంగ్‌లోనూ మెరిసి ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్‌తో `జనతా గ్యారేజ్`లో `నేను పక్కా లోకల్` అంటూ మాస్ ఆడియెన్స్ ని ఓ ఊపు ఊపింది. తనలోని ఘాటైన అందాలతో రెచ్చిపోయింది. దీంతో వెండితెరపై ఆడియెన్స్ సైతం ఆమె అందాలకు, వంపుసొంపులకు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం ఈ సీనియర్ భామ ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `భారతీయుడు 2`, `ఆచార్య`తోపాటు `మోసగాళ్ళు`, `ముంబయి సాగా`, `హే సినామికా` చిత్రాల్లో నటిస్తోంది. సీనియర్ హీరోలకు కాజల్ ఫస్ట్ ఛాయిస్ అవుతోంది.