- Home
- Entertainment
- Kajal: పలుచని దుస్తుల్లో కట్టిపడేస్తున్న కాజల్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసిన అందాల చందమామ
Kajal: పలుచని దుస్తుల్లో కట్టిపడేస్తున్న కాజల్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసిన అందాల చందమామ
అందాల చందమామ కాజల్ తల్లి అయ్యాక ఎక్కువగా యాడ్స్ తో కనువిందు చేస్తుంటుంది. అడపాదడపా గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా హోలీ స్పెషల్‌గా అందాల ఫోటోలను పంచుకుంది.

టాలీవుడ్ చందమామ కాజల్(Kajal) ఫ్యాన్స్ కి హోలీ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఆమె నిండైన దుస్తుల్లో ఫోటోలను పంచుకుంది. పలుచని బ్లూ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. చిలిపి పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో కాజల్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వాకింగ్ ఇన్ టూ 2023 కి లాగా అంటూ పేర్కొంది. ఆమె ఇచ్చిన పోజుల్లో కూడా వాకింగ్ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అలా ఈ ఏడాదిలోకి నడుస్తున్నట్టుగా పేర్కొంది. అయితే ఇందులో మరో మీనింగ్ కూడా ఉందా? అనిపిస్తుంది.
కాజల్ పెళ్లి, కుమారుడికి జన్మనివ్వడంతో సినిమాలకు దూరమైంది. ఏడాదికిపైగానే ఆమె సినిమాలకు గ్యాప్ వచ్చింది. కమిట్ అయిన సినిమాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆయా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుందా? అనేట్టుగా ఆమె పోస్ట్ ఉందని అంటున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం కాజల్ పెళ్లికి ముందే కమిట్ అయిన `ఇండియన్ 2` చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఇందులో కాజల్ పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు తెలుగులో కమ్ బ్యాక్ అవుతూ బాలయ్య సినిమాకి ఒప్పుకుంది. ఎన్బీకే 108లో ఆమె బాలయ్య కి జోడీగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులోనూ ఆమె పాల్గొనాల్సి ఉంది.
మరోవైపు తమిళంలో స్టార్ హీరో అజిత్‌తో జోడీ కట్టబోతుందట. అజిత్ నెక్ట్స్ సినిమాలో ఆయనకు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఇలా వరుసగా మళ్లీ బిజీ కాబోతుంది కాజల్. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన జోరు కొనసాగించేందుకు రెడీ అవుతుంది ఈ అందాల చందమామ.
కాజల్ మూడేళ్ల క్రితం ముంబయికి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విసయం తెలిసిందే. ఇక గతేడాది ఏప్రిల్‌లో ఆమె కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనిచ్చింది. ఇన్నాళ్లు కుమారుడి ఆలనాపాలనతో బిజీగా ఉంది. మరోవైపు కోల్పోయిన ఫిట్‌నెస్‌ని మళ్లీ పొందింది. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు వస్తుంది.