KP Choudhary: ‘కబాలి’ తెలుగు నిర్మాత ఆత్మహత్య
KP Choudhary Suicide: ‘కబాలి’ సినిమా నిర్మాత కె.పి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో కొంతకాలంగా ఉంటున్న ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అప్పులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Kabali, rajanikanth, KP Choudhary, suicide, telugu news, Telugu movie news
KP Choudhary Suicide: ‘కబాలి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నిర్మాత కె.పి చౌదరి (KP Choudhary) అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కొంతకాలంగా గోవాలో ఉంటున్నారు. అక్కడే ఆత్మహత్య చేసుకొన్నట్టు సమాచారం తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన కేపీ చౌదరి అనారోగ్య సమస్యలకు గురి అయ్యారని ఆ కారణంగానే ఆయన మరణించారని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు వెళ్లేసరికి ఆయన విగత జీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు.
Kabali
రజనీకాంత్ ‘కబాలి’ సినిమాని తెలుగులో విడుదల చేశారు చౌదరి. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
నిర్మాణంలో చాలా నష్టాలు రావటంతో ఆ తరవాత గోవా వెళ్లి అక్కడ ఓ పబ్ పెట్టారు. అయితే అక్కడా ఎదురు దెబ్బే తగిలింది. అక్రమంగా పబ్ పెట్టారన్న అభియోగాలతో గోవా ప్రభుత్వం ఆ పబ్‌ని కూల్చి వేసింది. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేవారని చెప్తారు.
సినిమాలు, పబ్ లతో వచ్చిన నష్టాలను పూడ్చడానికి డ్రగ్స్ దందాలోకి దిగినట్లు సమాచారం. ఆ తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు కె.పి.చౌదరి. అక్కడ నుంచి ఆయన జీవితం నరకప్రాయమైపోయింది. ఆయన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినవాళ్ళంతా తప్పుకున్నారు. డ్రగ్స్ కేసు ఇంకా నడుస్తోంది.
బెయిల్ పై బయటకు వచ్చిన కె.పి.చౌదరి గోవా వెళ్లిపోయారు. కొంతకాలంగా ఆయన ఆర్థిక ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం చేసిందని, చివరికి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చింది. అసలు చౌదరి మృతికి కారణం ఆర్థిక వ్యవహారాలేనా, మరేమైనా ఉన్నాయా? అనే యాంగిల్ లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.