ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్... కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
ఈమధ్య సెలబ్రిటీల వాడుతున్న వస్తువులు బాగా హైలెట్ అవుతున్నాయి. అవి స్పెషల్ అయితే.. వాటి కాస్ట్ ఎక్కువగా ఉంటే.. వెంటనే ఫ్యాన్స్ వైరల్ అవుతుంటాయి.. ఫ్యాన్స్ ఇంకా వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఒకటి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ టైగర్.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సంపాధించిన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.. ఆస్కార్ సాధించిన సినిమాకు హీరోగా ప్రపంచ వ్యాప్తంగ గుర్తింపు సాధించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్ లో పక్కా యాక్షన్ మూవీ దేవరలో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ స్టైల్ గురించి.. ఆయన వాడే వస్తువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాస్ట్లీ కార్లు.. కాస్ట్లీ బట్టలు.. మరీ ముఖ్యంగా కోట్లు విలువ చేసే కాస్ట్లీ వాచ్ లు వాడటంలో ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన వాదే వస్తువులు చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో మరోసారి ఎన్టీఆర్ కు సబంధిచిన వార్త ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
ఎన్టీఆర్ కి వాచ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం.. ఒక రకంగా పిచ్చి అనాలేమో... అన్ని రకలా వాచ్ లు కోట్ల విలువ చేసేవి ఉన్నాయి తరక్ దగ్గర. ఎన్టీఆర్ చేతికి కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్ లు పెట్టుకుంటారు. ఈక్రమంలో రీసెంట్ గా తన మేనల్లుడు పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం హైలెట్ అవుతోంది. దాని ఖరీదు గురించి తెలిసి అంతా నోరెళ్ళ బెడుతున్నారు.
ఎన్టీఆర్ వాచ్ గురించి ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..? హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు హర్ష పెళ్లి ఈనెల 20న గచ్చిబౌలిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ పెళ్లికి నందమూరి కుటుంబంలోని బాలకృష్ణ, మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు సందడి చేశారు.
ఎందుకంటే దీని ధర అక్షరాల 2.45 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఈ వాచ్ ఖరీదు బయటపడడంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అలాగే మామూలు జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ పెట్టుకున్న ఒక వాచ్ ఖరీదు తో ఒక కుటుంబం లైఫ్ లాంగ్ చాలాహ్యాపీగా జీవించవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఈవెంట్ కు నందమూరి , నారా ఫ్యామిలీల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ అందరిని ఆకర్షించారు.. ముఖ్యంగా.. ఆయన లుక్.. ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ పై అందరి దృష్టి పడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఆ వాచ్ అందరు ప్రత్యేంగా గమణించారు. ఇక ఈ వాచ్ పటేక్ ఫిలిప్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలుస్తోంది