Jr NTR: రెండు పడవల ప్రయాణం చేయనున్న ఎన్టీఆర్.. ఇలా జరుగుతోంది ఏంటి ?
కొరటాల శివ ఎప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తే అప్పుడు షూటింగ్ కి వెళ్లాలని ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు.

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు.
కొరటాల శివ ఎప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తే అప్పుడు షూటింగ్ కి వెళ్లాలని ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. కొరటాల కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. దీనితో బాగా ఆలస్యం అవుతోంది. మరింత టైం తీసుకుని కథని తిరిగి రాయమని ఎన్టీఆర్ కొరటాలకి సూచించినట్లు తెలుస్తోంది.
దీనితో ఎన్టీఆర్ కొరటాల చిత్రం అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారు. కొరటాల చిత్రం ఆలస్యం అవుతుండడంతో ఎన్టీఆర్ బుచ్చిబాబుని పిలిపించి రెండు నెలల్లో కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని సూచించారట.
అందుకే బుచ్చిబాబు తన గురువు సుకుమార్ సలహాలు తీసుకుంటూ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఆ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతా బుచ్చిబాబు సుకుమార్ కి పుష్ప 2 విషయంలో సాయం చేస్తున్నాడు అని భావించారు. కానీ అది నిజం కాదని.. తానే ఎన్టీఆర్ సినిమా కోసం సుకుమార్ గారి సాయం తీసుకుంటున్నట్లు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
కథ పూర్తి చేసి ఎన్టీఆర్ కి నేరేషన్ బుచ్చిబాబు రెడీ అవుతున్నాడు. బుచ్చిబాబు చిత్రం కూడా ఒకే అయితే.. 2023లో కొరటాల, బుచ్చిబాబు రెండు చిత్రాలని ఒకేసారి తారక్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ రెండు పడవల ప్రయాణం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కొరటాల చిత్రానికి అనౌన్సమెంట్ అయితే జరిగింది కానీ.. సినిమా బాగా ఆలస్యం అవుతుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతటి అంచనాలు అందుకునేందుకు ఎన్టీఆర్ దర్శకులు బాగా కష్టపడాల్సి వస్తోంది.