MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి కేకలు పెట్టించిన ఎన్టీఆర్.. దేవరపై గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్ 

పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి కేకలు పెట్టించిన ఎన్టీఆర్.. దేవరపై గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్ 

అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ మూవీ కలెక్షన్ల వరద తగ్గలేదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 08 2024, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ మూవీ కలెక్షన్ల వరద తగ్గలేదు. డీజే టిల్లు ని మించేలా టిల్లు స్క్వేర్ చిత్రం అభిమానులకు నచ్చేసింది. దీనితో చిత్ర యూనిట్ నేడు గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.    

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. అదే విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. అంతా ఊహించినట్లుగానే ఎన్టీఆర్ తన స్పీచ్ తో అదర గొట్టేశారు. టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూనే.. మధ్యలో ఫన్నీగా మాట్లాడుతూ.. దేవర చిత్రం గురించి ఫ్యాన్స్ ఊప్పొంగిపోయే విశేషాలు చెబుతూ అలరించారు. 

37

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కోవిడ్ పాండమిక్ కి ముందు వరకు నాకు సిద్దు జొన్నలగడ్డతో అంతగా పరిచయం లేదు. పాండమిక్ తర్వాత అతడితో మాట్లాడాను. అతడి పరిచయంతో నాకు అర్థం అయింది ఏంటంటే..సిద్దూకి సినిమా తప్ప ఇంకో ప్రపంచం లేదు. టిల్లు పాత్రని సిద్దు ఎంతగా ప్రేమించాడు అంటే.. అతడు మన అందరి ఇళ్లల్లో వ్యక్తిగా మారిపోయాడు. 

47

ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను. నేను నవ్వడం మొదలు పెడితే ఆపడం కష్టం. నా వల్ల అదుర్స్ టైం లో వినాయక్ గారు ఇబ్బంది పడ్డారు. బ్రహ్మానందం గారి ముఖం చూస్తేనే నాకు నవ్వు వచ్చేది. అలాగే అరవింద సమేత చిత్రం టైంలో త్రివిక్రమ్ గారు కూడా ఆ సమస్య ఫేస్ చేశారు. 

57

అంతకి మించి సిద్దు నన్ను నవ్వించాడు. సిద్దు భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు మరిన్ని ప్రేక్షకులకు అందించాలి. దేవర చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. కల కనడానికి ఒక ధైర్యం కావాలి.. ఆ కలని సార్థకం చేసుకోవడానికి భయం కావాలి అని ఎన్టీఆర్ తెలిపాడు. దీనితో ఫ్యాన్స్ కేరింతలుకొట్టారు. ఆ భయం శ్రద్ధలతోనే సిద్దు టిల్లు పాత్రలో నటించాడు అని ఎన్టీఆర్ ప్రశంసించాడు. 

67

ఆ డైలాగ్ చెప్పిన అనంతరం.. త్రివిక్రమ్ వైపు చూస్తూ.. కుదిరితే సరిదిద్దండి.. లేకుంటే క్షమించండి.. కానీ మేమున్నామని మాత్రం గుర్తించండి అంటూ పవన్ కళ్యాణ్ తరహాలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. దీనితో ఆడిటోరియం మోతెక్కిపోయింది. త్రివిక్రమ్ గారిని కలసి చాలా రోజులు అయింది అందుకే ఈ మాటలు చెప్పాలనిపించింది అంటూ తారక్ తెలిపాడు. 

77

చివర్లో దేవర గురించి చెబుతూ గూస్ బంప్స్ తెప్పించాడు. నేను ఈ రోజు షర్ట్ వేసుకుని వచ్చాను. దేవర రిలీజ్ కాస్త ఆలస్యం అయినప్పటికీ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకునేలా ఈ చిత్రం ఉంటుంది అని హామీ ఇచ్చారు. అంతకు ముందు మాట్లాడిన త్రివిక్రమ్.. ఈ ఉగాది నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved