- Home
- Entertainment
- RRR: రాజమౌళి పిచ్చి పీక్స్ కి చేరింది.. ఎన్టీఆర్ ని 'బండ' అని పిలిచేది ఎవరో తెలుసా..
RRR: రాజమౌళి పిచ్చి పీక్స్ కి చేరింది.. ఎన్టీఆర్ ని 'బండ' అని పిలిచేది ఎవరో తెలుసా..
ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ త్రయాన్ని ఇంటర్వ్యూ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు మరోసారి జోరుగా మొదలయ్యాయి. దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్రం కనీవినీ ఎరుగని అంచనాల నడుమ మార్చి 25న బ్రహ్మాండమైన విడుదలకు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుందని రాజమౌళి, ఎన్టీఆర్,రాంచరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలకి కొంచెం ఫన్ జోడించారు. ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లని ఇంటర్వ్యూ చేశారు. ఫుల్ ఫన్ గా సాగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బాగా అల్లరి చేశారు. షూటింగ్ సమయంలో రాజమౌళి ఎలా ఉంటారో పూర్తి హాస్య భరితంగా వివరించారు.
అనిల్ రావిపూడి రాజమౌళితో మాట్లాడుతూ.. సర్ నేను 30, 40 మందితో ఫ్యామిలీ సినిమాలు చేస్తాను.. కానీ మీ ఫ్యామిలిలో 30, 40 మంది సినిమా కోసం పనిచేస్తారు.. మీరంతా కలసి ఒకే బస్సులో షూటింగ్ కి వెళతారా అని అనిల్ రావిపూడి ఫన్నీగా ప్రశ్నించాడు. రాజమౌళి నవ్వుతూ.. లేదు ఇప్పుడే కొత్త బస్సు తయారు చేయించుకుంటున్నాం అని ఫన్నీగా సమాధానం ఇచ్చారు. రాజమౌళి ఫామిలీ గురించి ప్రస్తావన రాగానే ఎన్టీఆర్.. రమా, శ్రీవల్లి గురించి మాట్లాడారు.
రాజమౌళి వల్ల షూటింగ్ లో రోజంతా నలిగిపోతాం. మా బాధలు ఆయనతో చెప్పుకునే వీలుండదు. అలాంటప్పుడు రామా, శ్రీవల్లి తోనే మా బాధలు చెప్పుకుంటాం. అమ్మా.. ఏంటమ్మా ఇది.. చంపేస్తున్నాడు అని అంటే.. పిచ్చి నాన్న అని సమాధానం ఇస్తారు. ఈయన ఇక మారరా అని అడిగితే.. లేదు నాన్న.. పిచ్చి ఇంకా పెరిగింది.. పీక్స్ కి చేరింది అని అంటారు.
ఇంతలో కార్తికేయ వచ్చి రా అన్నా అని పిలుస్తాడు.. ఎక్కడికిరా అని అడిగితే షాట్ రెడీ అయింది అని అంటాడు. మళ్ళీ ఏంటమ్మా ఇది రమా గారితో మొరపెట్టుకుంటే.. వెళ్ళారా బండ.. త్వరగా అయిపోతుంది.. వెళ్లు బంగారు అని అంటుంది. దీనికి రాజమౌళి, చరణ్ పగలబడి నవ్వారు. రమా గారు తనని ముద్దుగా బండ అని పిలుస్తారు అని ఎన్టీఆర్ అన్నారు.
ఎప్పుడైనా బాగా కష్టంగా అనిపించినప్పుడు.. జక్కన్నా ఇక చాలు అని అడుగుతా.. దీనికి ఆయన చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆయన ధ్యాసలో ఆయన ఉంటారు అని ఎన్టీఆర్ తెలిపారు. ఇలా ఎన్టీఆర్..అనిల్ రావిపూడితో తమ షూటింగ్ కష్టాలు వివరించాడు.