MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోహన్ బాబు లాంటి మొనగాడు ఇంకొకరు లేరు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకలా అన్నారు..వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి..

మోహన్ బాబు లాంటి మొనగాడు ఇంకొకరు లేరు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకలా అన్నారు..వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి నందమూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆయన తన సోదరుడిగానే భావిస్తారు. బాలకృష్ణ, హరికృష్ణ లతో కూడా మోహన్ బాబు నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి యమదొంగ చిత్రంలో నటించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి నందమూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆయన తన సోదరుడిగానే భావిస్తారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ అనే అద్భుతమైన చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాలకృష్ణ, హరికృష్ణ లతో కూడా మోహన్ బాబు నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి యమదొంగ చిత్రంలో నటించారు. 

26

యమదొంగ చిత్రంలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తన గంభీరత్వంతో మోహన్ బాబు యముడి పాత్రకి ప్రాణం పోశారు. ఈ పాత్రలో మోహన్ బాబుని రాజమౌళికి సూచించింది ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్. ఓ ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాన్ని తెలిపారు. 

36

యమదొంగ చిత్రానికి జరిగిన డిస్కషన్స్ ని ఎన్టీఆర్ బయట పెట్టారు. రాజమౌళి వచ్చి ఒక టైటిల్ చెబుతాను ఎలా  ఉందో చెప్పు అని అడిగారు. యమదొంగ అని అన్నారు. అదేంటి జక్కన్నా అని అడిగా. అవును తారక్ యమగోల తరహాలో మనం ఒక చిత్రం చేస్తున్నాం అని చెప్పారు. నాకు చిన్న పాటి భయం కలిగింది. 

46

సరే జక్కన్న యముడికి పాత్ర చాలా కీలకం కదా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగా. ఎవరైతే బావుంటుందో నువ్వే చెప్పు తారక్ అని అడిగారు. ఇంకెవరున్నారు జక్కన్నా ఆ పాత్రలో నటించే ఏకైక మగాడు మోహన్ బాబు మాత్రమే అని చెప్పా. ఆ పాత్ర చేయగలిగేది ఆయన ఒక్కడే. మరి ఆయన చేస్తారో లేదో తెలియదు కదా జక్కన్నా అని అడిగా. నీకుందుకు తారక్ నేను వెళ్లి మాట్లాడతా అని చెప్పారు. 

56

రాజమౌళి అడగగానే మోహన్ బాబు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నువ్వు డైరెక్టర్ నువ్వు కాబట్టి, తారక్ సినిమా కాబట్టి ఈ సినిమా నేను చేస్తున్నాను అని మోహన్ బాబు అన్నారు.  ఈ చిత్ర ఆడియో వేడుకలో కూడా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నగారి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఉన్నంతవరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ మోహన్ బాబు తారక్ ని ఉద్దేశించి అన్నారు. 

66

ఈ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగులు చెప్పాడు. ఎక్కడైనా తప్పు చెబుతాడేమో అని అలా చూస్తూ ఉన్నా. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. వెంటనే నా మరదలు తారక్ తల్లికి ఫోన్ చేసి.. అమ్మా నువ్వు హాయిగా నిద్రపో.. వాడు అద్భుతంగా డైలాగులు చెప్పాడు అని చెప్పినట్లు మోహన్ బాబు అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image3
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved