ఎన్టీఆర్‌కి సొంతూరులో వందల కోట్ల ఆస్తులు.. ఊరిపై ప్రేమతో తారక్ ఏం చేశాడో తెలుసా?
నందమూరి వారసత్వంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. బాల రామాయణం చిత్రంతో నటనలో ఓనమాలు దిద్దిన తారక్.. యుక్త వయసు వచ్చాక నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు.

నందమూరి వారసత్వంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. బాల రామాయణం చిత్రంతో నటనలో ఓనమాలు దిద్దిన తారక్.. యుక్త వయసు వచ్చాక నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి తారక్ జైత్ర యాత్ర మొదలైంది. నందమూరి వారసత్వం కొనసాగిస్తూ.. తాత ఎన్టీఆర్ , బాబాయ్ బాలకృష్ణ తరహాలో తెలుగు ప్రేక్షకులని అలాంటించిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం తారక్ ఒక చిత్రానికి 70 నుంచి 80 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంత రెమ్యునరేషన్ అందుకునే సమయంలో ఆస్తులు పెద్ద విషయం కాదు. కానీ తారక్ ఆస్తులకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం కొడాలి నాని ద్వారా బయటకి వచ్చింది.
Nandamuri Harikrishna
వివాదాస్పద ఎమ్మెల్యే కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ నటించిన కొన్ని చిత్రాలకు కొడాలి నాని కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తరచుగా నాని.. ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా నాని నందమూరి ఫ్యామిలీకి నిమ్మకూరుపై ఉన్న ప్రేమని వివరిస్తూ జూఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ గారికి నిమ్మకూరు అంటే ప్రాణం.. వీలు చిక్కితే పది రోజులకు ఒకసారి అయినా ఉరికి వచ్చి వెళ్లేవారు. అదే ప్రేమని హరికృష్ణ కూడా చూపించారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు రూ. 14 కోట్లతో నిమ్మకూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కొడాలి నాని తెలిపారు.
ఎన్టీఆర్ నిమ్మకూరులో తన ఆస్తులని సమానంగా వారసులకు పంచారట. జూ. ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వారసత్వంగా నిమ్మకూరులో 5 ఎకరాల పొలం ఉన్నట్లు నాని వివరించారు. ప్రస్తుతం ఆ పొలం విలువ రూ 10 కోట్ల పైనే ఉంటుంది అని తెలిపారు. తాతగారి ఊరితో తనకి ఎప్పటికి అనుబంధం ఉండాలని జూ. ఎన్టీఆర్ మరో పాతిక ఎకరాలు అదనంగా కొనుగోలు చేశారని కొడాలి నాని వివరించారు.
ఆ ఊరిలో ఎన్టీఆర్ రూ. 60 లక్షలు పెట్టి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారట. నందమూరి ఫ్యామిలీ తప్ప చంద్రబాబు ఆ ఊరికి చేసింది ఏమీ లేదు అని కొడాలి నాని ఈ సందర్భంగా విమర్శలు చేశారు.