- Home
- Entertainment
- Jr NTR: భారీ బడ్జెట్, తేడా వస్తే అంతే.. ముందే పసిగట్టి తెలివిగా ఆ పని చేసిన ఎన్టీఆర్
Jr NTR: భారీ బడ్జెట్, తేడా వస్తే అంతే.. ముందే పసిగట్టి తెలివిగా ఆ పని చేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడంతో మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఫాంటసీ ఎలిమెంట్స్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడంతో మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తన సొంత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దాదాపు 40 కోట్ల పైగా బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మించబడింది.
కళ్యాణ్ రామ్ మార్కెట్ తో పోల్చుకుంటే ఇది భారీ బడ్జెట్ అనే చెప్పాలి. ఇంత బడ్జెట్ రికవరీ కావాలంటే తప్పకుండా సినిమా అద్భుతంగా ఉండాలి.. అలాగే మంచి హైప్ క్రియేట్ అవ్వాలి. ఈ చిత్రం విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాడనేది స్పష్టం. ఈ చిత్రం పూర్తి కాగానే మొదట చూసింది ఎన్టీఆరే.
40 కోట్ల బడ్జెట్ రికవరీ కావాలంటే చిన్న పొరపాటు కూడా జరగకూడదు. హిస్టారికల్ నేపథ్యం ఉన్న చిత్రాలకి సంగీత అత్యంత కీలకం. బిజియం ఆ కాలాన్ని గుర్తు చేస్తూ సాగాలి. మొదట ఈ చిత్రానికి చిరంతన్ భట్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మేకింగ్ ప్రాసెస్ లో చిన్న వెలితి కనిపించింది అని.. ఆ వెలితి మరెవరో కాదు ఎంఎం కీరవాణి అని ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపిన సంగతి తెలిసిందే.
ఇలాంటి కథకు బిజియం ఇవ్వాలంటే అది కీరవాణికే సాధ్యం అని ఎన్టీఆర్ ముందుగా గ్రహించి కళ్యాణ్ కి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కీరవాణి కూడా ఈ చిత్రంలో భాగం కావడం.. కొన్ని సాంగ్స్, బిజియం అందించడం జరిగింది. ఆ తర్వాత ఈ చిత్రానికి కంప్లీట్ షేప్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కీరవాణి గారి మ్యూజిక్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచింది అని ఎన్టీఆర్ స్వయంగా తెలిపారు.
ప్రస్తుతం సినిమా అవుట్ పుట్ పై చిత్ర యూనిట్ మొత్తం హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంతా సినిమా టాక్ పై ఆధారపడి ఉంది. ఆల్రెడీ మంచి హైప్ ఉంది కాబట్టి టాక్ బావుంటే బడ్జెట్ రికవరీ అంత కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాతలు అంతా ప్రేక్షకులని థియేటర్స్ కి ఎలా రప్పించాలి అంటూ మేధోమధనం చేస్తున్నారు.