MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అమలతో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నాగార్జున కొట్టడానికి దూకారు.. నా తప్పేం లేదు అంటూ క్రేజీ హీరో కామెంట్స్

అమలతో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నాగార్జున కొట్టడానికి దూకారు.. నా తప్పేం లేదు అంటూ క్రేజీ హీరో కామెంట్స్

టాలీవుడ్ ఎంతో అన్యోన్యంగా జీవించే దంపతులతో నాగార్జున అమల ముందు వరుసలో ఉంటారు. 1992లో నాగార్జున అమల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2024, 09:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ ఎంతో అన్యోన్యంగా జీవించే దంపతులతో నాగార్జున అమల ముందు వరుసలో ఉంటారు. 1992లో నాగార్జున అమల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు జేడీ చక్రవర్తి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణించారు. నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇటీవల ఆయన దయ అనే వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన శివ చిత్రంతోనే జెడి చక్రవర్తి కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. శివ చిత్రంలో జెడి చక్రవర్తి బ్యాడ్ బాయ్ గా నటించారు. ఆ మూవీలో అమల హీరోయిన్ గా నటించింది. ఆ చిత్ర షూటింగ్ లో అమలతో, నాగార్జునతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అని జెడి చక్రవర్తి తెలిపాడు. 

37

అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను నడుచుకుంటూ వస్తున్నాను. నాగార్జున గారు కూడా ఎదురుగా వస్తున్నారు. చూసుకోకుండా ఒకరినొకరం గుద్దుకున్నాం. ఆయన వెంటనే ఏయ్ చూసుకుని నడవవా అని అడిగారు.. నేను సారీ చెప్పుంటే సరిపోయేది.. పిల్ల నా కొడుకుని కదా.. కాస్త ఎక్కువగా మాట్లాడా. లేదండీ ఇద్దరం చూసుకోలేదు కదా అని అన్నా. ఏం అనుకుంటున్నావు నువ్వు అని అన్నారు. 

47

అనుకోవడానికి ఏమీ లేదు అండీ అని అన్నా.. వెంటనే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అంటూ వాయిస్ పెంచారు. వెంటనే ఆయనకి కోపం వచ్చింది కొట్టడానికి దూకుతున్నారు. నాగార్జున గారికి కోపం వస్తే పక్కన ఎవరూ ఉండరు అందరూ వెనక్కి వెళ్లిపోయారు. బిహేవ్ యువర్ సెల్ఫ్ సర్ అన్నా.. వెంటనే లాగిపెట్టి కొట్టారు. 

57

దీనితో అన్నపూర్ణ స్టూడియోస్ లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది నన్ను కొట్టాలని రాడ్డులతో బయలుదేరారు. అది గమనించిన నాగార్జున గారు వెంటనే నన్ను పట్టుకుని పక్కనే ఉన్న కేఫ్ లోకి లాక్కుని వెళ్లిపోయారు. వాళ్ళు నన్ను నిజంగా కొట్టేస్తారేమో అని నాగార్జున అలా చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇదంతా రామ్ గోపాల్ వర్మ కావాలని చేయించారు. 

67

చూస్తూ ఉన్న వాళ్లంతా నిజంగా గొడవ జరుగుతుంది అని నమ్మేలా నాగార్జునతో నువ్వు గొడవ పడాలి అని చెప్పారు. ఇదంతా షూటింగ్ అని తెలిస్తే జనం వచ్చేస్తున్నారు. కంట్రోల్ చేయడం కుదరడం లేదు. కాబట్టి వర్మ ఈ ప్లాన్ చేశారు. కెమెరా కనిపించకుండా ఎక్కడో పైన పెట్టేశారు. ఈ ఫైట్ లో శివ మూవీలో కేఫ్ లో ఉంది అని జెడి చక్రవర్తి తెలిపారు. షూటింగ్ లో భాగంగా గొడవ పడితే నిజంగానే గొడవ అనుకుని అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు నా మీదకి రాడ్డులతో రావడం మరచిపోలేను అని జెడి తెలిపారు. 

77

నాకు శ్రీదేవి తర్వాత అంత ఇష్టమైన హీరోయిన్ అమల. ఆమెకి అమల గారు అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. మనం అంతా ఫ్రెండ్స్.. అమల అని పిలవండి చాలు అని చెప్పేవారు. ఘర్షణ, పుష్పక్ లాంటి గొప్ప చిత్రాల్లో నటించిన హీరోయిన్ నా కళ్ళ ఎదుట ఉంటే నమ్మలేకపోయా. ఆమెకి ఒక సన్నివేశం గురించి వివరించడానికి వెళ్ళా. కానీ నాకు మాటలు రావడం లేదు. నేను తడబడుతున్నానని గమనించి.. కూల్ గా చెప్పు అన్నారు. ఆ తర్వాత ఆమెకి సీన్ గురించి చెప్పినట్లు జెడి తెలిపారు. అది తనకి అమలతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని జెడి గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved