- Home
- Entertainment
- విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయం మాత్రం పక్కా అంటోందే.!
విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయం మాత్రం పక్కా అంటోందే.!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులే కాకుండా.. బాలీవుడ్ బ్యూటీలు కూడా విజయ్ ని ఇష్టపడుతారు. తాజాగా జాన్వీ కపూర్ విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అభిమానులను అలరిస్తోంది. తను నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతుండటంతో ఈ బ్యూటీ ఇటీవల ఇంటర్వ్యూలతో బిజీగా అవుతూ.. క్రేజీగా ఆన్సర్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిస్తూ.. విజయ్ పై ఉన్న ఫీలింగ్ ను బయటపెట్టింది.
హిందీ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee with Karan)లో జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండపై చేసిన కామెంంట్స్ గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు.. క్రేజీగా బదులిచ్చింది. ‘విజయ్ దేవరకొండ ఒక గిఫ్టెడ్ యాక్టర్ అని, గుడ్ లుక్, సినిమాటిక్ యాక్టర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.
‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్ లో విజయ్ నటన అద్భుతంగా ఉంటుందని.. అతనితో కలిసి పక్కా నటించాలని ఉంది. నిజాని విజయ్ గ్రేట్ యాక్టర్, అందుకే అతనితో సినిమా చేయాలనుకుంటున్నాను.. అని ఆసక్తికరంగా బదులిచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీకి పలు ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. కానీ సమయం కుదరడం లేదు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘జన గణ మన’లో జాన్వీ కపూర్ ను ఎంపిక చేయాలని భావించినా.. కుదరలేదు. దీంతో పూజా హెగ్దేను ఫైనల్ చేశారు. ఇదిలా ఉంటే.. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రంలోనూ హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. కానీ పక్కా సమాచారం లేదు. ఏదేమైనా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని జాన్వీ బలంగా కోరుకుంటోంది.
ఇక కేరీర్ విషయానికొస్తే.. వరుస చిత్రాలతో జాన్వీ తన అభిమానులను అలరిస్తోంది. రొటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. రీసెంట్ గా తను నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘మిలీ, మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది.