బ్లాక్ అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ పోజులు.. నడుము కొలతలు చూపిస్తూ కవ్విస్తున్న బోల్డ్ బ్యూటీ!
వేకేషన్ పూర్తి చేసుకొని ముంబైలో అడుగు పెట్టింది బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రోజుకో తీరుగా దర్శనమిస్తోంది. నిన్న వరకు వేకేషన్ లో ఉన్న ఈ కుర్ర భామా మతులు పోయే ఫొటోలను నెట్టింట షేర్ చేసి దుమారం రేపింది. జాన్వీ పంచుకున్న ఫొటోలు ఇంకా వైరల్ అవుతున్నాయి.
పొట్టి దుస్తులు, బికినీలు, స్విమ్ సూట్లలో హాట్ హాట్ అందాలను వడ్డించి పిచ్చెక్కించింది. ఘాటు పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తాజాగా జాన్వీ కపూర్ తన వేకేషన్ ను పూర్తి చేసుకొని ముంబైలో అడుగు పెట్టింది.
నగరంలో చేరుకున్న సందర్భంగా స్టార్ నటులు వరుణ్ ధావన్, దుల్కర్ సల్మాన్, రిషబ్ షెట్టి, తదితర నటీనటులు పాల్గొన్న ఓ కార్యకర్యంలో పాల్గొంది. ఈ క్రమంలో బ్లౌక్ అవుట్ ఫిట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది.
ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్ కూడా చేసింది జాన్వీ కపూర్. కొద్దిగా నడుమును చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది. కవ్వించే చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పరువాల ప్రదర్శనలో హద్దులు మీరిన జాన్వీ ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా అదరగొడుతోంది.
అతిలోక సుందరి, దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ తల్లినడిచిన బాటలో కాకుండా.. ఇండస్ట్రీలో తనదైన శైలిలో ముందుకెళ్తోంది. సినిమాల పరంగానూ చాలా వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడిప్పుడే వరుస చిత్రాలతో జాన్వీ ఫుల్ బిజీ అవుతోంది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ చిత్రంలో నటిస్తోంది.
ఇక ఎప్పటి నుంచో జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో జాన్వీ అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ ఎన్టీఆర్ సరసన నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాని తెలిపింది. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.