- Home
- Entertainment
- Avatar Fire and Ash: అవతార్ కొత్త ట్రైలర్ తెలుగులో, మతిపోగొట్టే విజువల్స్.. కామెరాన్ కి దండం పెట్టాల్సిందే
Avatar Fire and Ash: అవతార్ కొత్త ట్రైలర్ తెలుగులో, మతిపోగొట్టే విజువల్స్.. కామెరాన్ కి దండం పెట్టాల్సిందే
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాలలో అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ మూవీ ట్రైలర్ తెలుగులో విడుదలైంది.
విజువల్ వండర్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్
విజువల్స్ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులని మైమరపించొచ్చు అని నిరూపించిన దర్శకులలో జేమ్స్ కామెరాన్ ఒకరు. ఈ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి నుంచి వచ్చిన టైటానిక్ లాంటి చిత్రాలకు వరల్డ్ వైడ్ గా ఎంతటి ఆదరణ లభించిందో ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాక్సాఫీస్ లెక్కలని మార్చాలంటే తనకి మాత్రమే సాధ్యం అని జేమ్స్ కామెరూన్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ అవతార్ ప్రాంచైజీతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాంఛైజీ నుంచి వస్తున్న ఒక్కో చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉంటోంది.
తెలుగులో అవతార్ ఫైర్ అండ్ యాష్ కొత్త ట్రైలర్
తన అద్భుతమైన విజువల్ మాయ ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకువెళ్లి గొప్ప థ్రిల్ ని కామెరూన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు అవతార్ ప్రాంఛైజీలో రెండు చిత్రాలు వచ్చాయి. మూడవ ఇన్స్టాల్మెంట్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. కొన్ని నెలల క్రితమే అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. తాజాగా మరో సరికొత్త ట్రైలర్ వచ్చేసింది. ఈసారి తెలుగులో కూడా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్ లా ఉంది ట్రైలర్. పండోర గ్రహంలో జరుగుతున్న అగ్ని విధ్వంసాన్ని మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కామెరూన్ ఆవిష్కరించబోతున్నట్లు ఈ ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
పండోర గ్రహంలో అగ్ని ప్రళయం
పండోర గ్రహంలో వచ్చే అగ్ని ప్రళయం గురించి ట్రైలర్ బిగినింగ్ లో వివరించారు. ఈసారి కూడా జేమ్స్ కామెరూన్ కథని సింపుల్ గానే ఉంచినట్లు అర్థమవుతోంది. పండోర గ్రహంలో వచ్చే ఆపద నుంచి తన జాతిని కాపాడేందుకు జేక్ సల్లీ, అతడి ఫ్యామిలీ, అనుచరులు ఎలా పోరాడారు అనేదే కథగా తెలుస్తోంది. కానీ జేమ్స్ కామెరూన్ ప్రజెంట్ చేస్తున్న విజువల్స్ ఊపిరి బిగబట్టి ఆస్వాదించేలా ఉన్నాయి.
శత్రువులతో పోరాటం
అవతార్ ఫైర్ అండ్ యాష్ మరింత గ్రాండియర్ గా ఉండబోతోంది. జేక్ సల్లీ తన ఫ్యామిలీని కాపాడుకుంటూనే శత్రువులతో ఎలా పోరాడాడు అనేది కథలో ప్రధాన కాన్ ఫ్లిక్ట్ అని భావించవచ్చు. ట్రైలర్ లో ఉన్న విజువల్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పంచ భూతాలతో జేమ్స్ కామెరూన్ చేస్తున్న ప్రయోగం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న మూవీ
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో శామ్ వర్తింగ్టన్ నటిస్తున్నారు. ఆయన జేక్ సల్లీ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి భార్య నయిత్రీ పాత్రలో జో సోల్డనా నటిస్తున్నారు. ప్రపంచం మొత్తం అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ కోసం ఎదురుచూస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.