Pushpa2లో జగపతి బాబు.. కన్ఫమ్ చేసిన జగ్గు బాయ్.. అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు ఉన్నారంటూ ఆయనే స్వయంగా కన్ఫమ్ చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఒకప్పుడు హీరోగా వెండితెరపై ప్రశంసలు అందుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ తోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అభిమానులు, ఆడియెన్స్ కూడా ఆదరించడంతో భారీ చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రలను దక్కించుకుంటున్నారు.
బాలయ్య నటించిన ‘లెజెండ్’ చిత్రంలో విలన్ గా అవతారం ఎత్తిన జగపతి బాబు (Jagapathi babu) ఇండస్ట్రీలో బిజీగా మారిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో తన సత్తా చాటుతున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, గూఢచారి, రాధే శ్యామ్, గని, వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.
దీంతో ఇండస్ట్రీలో క్రేజీగా విలనిజాన్ని చూపిస్తూ భారీ చిత్రాలలో చోటు దక్కించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనూ జోరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా Pushpa 2 The Ruleపై క్రేజీ అప్డేట్ అందించారు.
అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సీక్వెల్ లో మరిన్ని పాత్రలు యాడ్ కానున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందులో జగపతి బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక తాజాగా ‘పుష్ప2’లో తాను నటిస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. సుకుమార్ తో కలిసి పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Pushpa 2లో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్స్ చేయడమంటే నాకెంతో ఇష్టం. సుక్కుతో సినిమా అంటే ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. దాదాపు 20 ఏళ్ల కింద అల్లు అర్జున్ జిమ్ లో చూశాను. అప్పుడు బన్నీ నాకు ఎవరో తెలియదు. తను హార్డ్ వర్క్ చేయడం గమనించాను. బన్నీని చూస్తుంటే గర్వంగా ఉంది.’ అంటూ ప్రశంసించారు.
ఇక ఇప్పటికే జగపతి బాబు ‘పుష్ప2 : ది రూల్’ వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొన్నట్టు సమాచారం. తాజాగా జగపతి బాబు కన్ఫమ్ చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక జగ్గు బాయ్ చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ ప్రభాస్ ‘సలార్’ కూడా ఉన్న విషయం తెలిసిందే. అలాగే మహేశ్ బాబు SSMB28లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.