జబర్దస్త్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న వర్ష... అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!
జబర్దస్త్ మానేసిన వర్ష పెల్లెటూరికి వెళ్లిపోయారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతున్నారు. ఎద్దులబండి పై తిరుగుతూ, ట్రాక్టర్ తోలుతూ ఫక్తు రైతు రూపంలోకి మారిపోయింది.

వర్ష వ్యవసాయం చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారగా చూసిన ఫ్యాన్స్ అయ్యో అంటున్నారు. చక్కగా నువ్వుతూ నవ్విస్తూ ఉండే నీకు అంత కష్టమెందుకు వచ్చింది అంటున్నారు. అయితే వర్ష నిజంగా బుల్లితెర వదిలేసి రైతు కాలేదు లెండి. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో షూట్ చేసింది.
పల్లె జీవనాన్ని ప్రతిబింబిస్తూ వర్ష ఫోటో షూట్ వైరల్ గా మారింది. జబర్దస్త్ వేదికగా ఫేమస్ అయిన వర్ష బుల్లితెరపై దూసుకెళుతున్నారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష అలరిస్తున్నారు. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా వర్ష అవతరించారు.
వర్ష ఇంతగా ఫేమస్ కావడానికి కారణం ఇమ్మానియేల్ అని చెప్పాలి. ఇమ్మానియేల్-వర్ష కాంబినేషన్లో రూపొందిన స్కిట్స్ కి మంచి ఆదరణ దక్కింది. ఆడియన్స్ ఆదరించారు. ఆ ఫార్ములాలో వరుసగా స్కిట్స్ చేసి సక్సెస్ అయ్యారు.
వర్ష-ఇమ్మానియేల్ లవ్ బర్డ్స్ గా అవతరించారు. ప్రస్తుతం ప్రేక్షకుల మదిలో వీరిపై ఉన్న అభిప్రాయం అదే. ఆ అభిప్రాయాన్ని వీరిద్దరి ప్రవర్తన మరింత బలపరిచేదిగా ఉంటుంది. ఇటీవల వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళికట్టాడు.
వర్ష ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటానని ఇమ్మానియేల్ అన్నాడు. గెటప్ శ్రీను తాళి తెచ్చి ఇవ్వగానే... వర్ష మెడలో కట్టి పెళ్ళాం చేసుకున్నాడు. అయితే ఇది ఉత్తితే పెళ్ళి అని చెప్పాలి. అందుకే వర్ష ప్రతిఘటించకుండా చక్కగా కట్టించుకుంది.
తాజాగా ఆమెకు ఖరీదైన ఆభరణాలు గిఫ్ట్ గా ఇచ్చాడు. త్వరలో వర్ష బర్త్ డే నేపథ్యంలో నగల షో రూమ్ కి తీసుకుపోయి నచ్చిన వస్తువు కొనిచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా వర్ష-ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు. వారి మధ్య ఉన్న సంగతి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఒకప్పుడు రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ బుల్లితెర లవ్ బర్డ్స్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. వారి బాటలో వర్ష-ఇమ్మానియేల్ పయనిస్తున్నారు. వీరిద్దరిపై రూమర్స్ పెరిగే కొద్దీ ఆఫర్స్ పెరుగుతున్నాయి.
అయితే ఈ జంటపై వ్యతిరేకత కూడా ఉంది. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ తో వీరిద్దరినీ ఏకిపారేశావారు లేకపోలేదు. ఒక దశలో యూట్యూబ్ కామెంట్స్ చూపించి వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. అప్పుడు కన్నీరు పెట్టుకొని జబర్దస్త్ మానేస్తున్నానని వర్ష చెప్పారు. చెప్పినట్లే కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న వర్ష మళ్ళీ రావడం జరిగింది.
జబర్దస్త్ మానేసిన వర్ష పెల్లెటూరికి వెళ్లిపోయారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతున్నారు. ఎద్దులబండి పై తిరుగుతూ, ట్రాక్టర్ తోలుతూ ఫక్తు రైతు రూపంలోకి మారిపోయింది.