ఇమ్మాన్యుయెల్ ని కాదని మరో కమెడియన్‌తో `జబర్దస్త్` వర్ష పెళ్లి.. `అన్నా` అని పిలవడంతో ఇమ్మూ ఫైర్
`జబర్దస్త్` కామెడీ షో గతంతో పోల్చితే ఇప్పుడు క్రేజ్ తగ్గింది. అదే సమయంలో ఫన్ కూడా తగ్గింది. ఏదో వస్తుందంటే వస్తుందనేలాగా ఎపిసోడ్లు ఉంటున్నాయి. ఆడియెన్స్ లోనూ అసంతృప్తి కనిపిస్తుంది.
photo credit-extra jabardasth promo
జబర్దస్త్ కామెడీ తెలుగులో బుల్లితెర కామెడీ షోస్‌లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్. ఇందులో కామెడీ స్కిట్లతోపాటు లవ్ స్కిట్లు, డ్యూయెట్లు, పెళ్లిళ్ల స్కిట్లు బాగా ఫేమస్‌గా నిలిచాయి. మంచి ఆదరణ పొందాయి. ఇటీవల ఆ స్టయిల్ తగ్గింది. దీంతో మళ్లీ ఆ వైపు ఫోకస్ పెడుతుంది మల్లెమాల టీమ్. షోకి క్రేజ్ తగ్గుతున్న నేపథ్యంలో అలాంటి స్కిట్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి అలాంటి సీన్లతో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.
photo credit-extra jabardasth promo
`జబర్దస్త్` కామెడీ షోలో సుడిగాలి సుధీర్, రష్మిల జోడీ తర్వాత ఇమ్మాన్యుయెల్, వర్షల జోడీ బాగా ఫేమస్ అయ్యింది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, పెళ్లిళ్లు, డ్యూయెట్లు బాగా పండాయి. నిజ జీవితంలోనూ ఈ ఇద్దరు లవర్స్ అనేలా ప్రొజెక్ట్ అయ్యింది. దారుణంగా కామెంట్లని వర్ష ఎదుర్కొంది. కొన్నాళ్లు షోకి దూరంగా ఉంది. తర్వాత తేరుకుని మళ్లీ రాణిస్తుంది. అయితే ప్రారంభంలో ఇమ్మాన్యుయెల్‌తోనే స్కిట్లు చేశారు.
photo credit-extra jabardasth promo
ఇటీవల చాలా మార్పు కనిపిస్తుంది, వర్ష ఇమ్మాన్యుయెల్‌తో సరిగా ఉండటం లేదు. దూరం దూరంగానే కనిపిస్తుంది. ఇతర కమెడీయన్లతో స్కిట్లు చేస్తుంది. ఇమ్మాన్యుయెల్ టీమ్ అయినా, ఇతర కమెడియన్లకు జోడీగా కనిపించడం విచిత్రంగా అనిపించింది. ఎవరితో చేసినా జోడీ మాత్రం ఇమ్మాన్యుయెల్‌దే అని ఫ్యాన్స్ భావించారు. అలానే ఆదరించారు. కానీ ఉన్నట్టుండి పెద్ద షాక్ ఇచ్చింది వర్ష. ఇమ్మూకి హ్యాండించింది.
photo credit-extra jabardasth promo
ఇమ్మాన్యుయెల్‌ని కాదని వేరే కమెడియన్‌ని పెళ్లి చేసుకుంది. ఇమ్మాన్యుయెల్‌ని మోసం చేయడమే కాదు,ఏకంగా ఆమె పలికిన మాట పెద్ద రచ్చ అవుతుంది. ఇమ్మూని పట్టుకుని వర్ష.. `అన్నయ్య` అంటూ సంభోదించింది. కొత్త కమెడీయన్‌ని ఆమె వివాహం చేసుకోవడం గమనార్హం. ఇది చూసి అటు ఇమ్మాన్యుయెల్, ఇటు బాబూ షాక్ అయ్యారు. వర్ష చేసిన పనికి ఒక్కసారిగా స్టన్ అయ్యారు.
photo credit-extra jabardasth promo
కట్ చేస్తే నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా? నేను నీకోసం మంచి మంచి సంబంధాలు చూస్తున్నా అని ఇమ్మాన్యుయెల్ చెప్పడం విశేషం. మరోవైపు బాబు కూడా నీకోసం పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నా అని తెలిపారు. దీంతో తట్టుకోలేక.. నువ్వు చూసిన సంబంధాలు చేసుకుంటే ఈ అన్నయ్యకి కోపం వస్తుందని, ఇమ్మూని పట్టుకుని పెద్ద మాట అనేసింది వర్ష.
photo credit-extra jabardasth promo
దీంతో తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యుయెల్. నువ్వు ఏమైనా అను, అన్న మాత్రం అనొద్దని, అలా పిలిస్తే చాలా కోపం వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. తన మనసులో బాధని దిగమింగుకుని ఆయన ఇలా సింపుల్‌గా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. మరోవైపు సంసారం విషయంలో ఇంట్లో పెద్ద గొడవ..
photo credit-extra jabardasth promo
వర్ష చేసుకున్న వాడి ఫ్యామిలీలో భర్త అన్నయ్య.. ఇద్దరు ఎక్కడ ఉంచాలో చర్చ జరిగింది. ఆరు నెలలు ఇద్దరు కలిసి ఉండొద్దని, ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మండిపోయిన వర్ష భర్త మా ఇద్దరిని ఒక్క చోట ఉండనివ్వరా అంటూ తమని సంసారం చేసుకోనివ్వరా అనేలా రియాక్ట్ కావడం విశేషం. దీంతో ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. ప్రమోలో హైలైట్‌గా నిలిచింది.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.