- Home
- Entertainment
- Rashmi on Casting Couch: టాప్ పొజీషన్‌కి వెళ్లాలంటే పడుకోవాల్సిందే.. `జబర్దస్త్` యాంకర్ సంచలన వ్యాఖ్యలు
Rashmi on Casting Couch: టాప్ పొజీషన్‌కి వెళ్లాలంటే పడుకోవాల్సిందే.. `జబర్దస్త్` యాంకర్ సంచలన వ్యాఖ్యలు
`జబర్దస్త్` యాంకర్ రష్మి క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. గతంలో ఓ సారి క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడు మరోసారి షాకించే కామెంట్ చేసింది. దీంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది రష్మి.

`జబర్దస్త్` యాంకర్‌గా(Anchor Rashmi) పాపులర్ అయిన రష్మి.. సామాజిక విషయాలపై చాలా బోల్డ్ గా స్పందిస్తుంది. జంతువులపై ఎంతో ప్రేమని కలిగిన ఆమె డాగ్స్ ని బాగా ఇష్టపడుతుంది. అదే సమయంలో మహిళా శక్తినిచాటే ప్రయత్నం చేస్తుంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ విషయంలో ముందుంటుంది. తాజాగా రష్మి `క్యాస్టింగ్ కౌచ్`(Casting Couch)పై స్పందించింది. ఆసక్తికర కామెంట్ చేయగా, అది వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ ఫోటోని పెట్టి కొందరు ట్రోలర్స్ వల్గర్ కామెంట్ పెట్టారు. టాప్ పొజీషియన్‌కి చేరుకోవడానికి ఆమె కచ్చితంగా పడుకుని ఉంటుందనే అర్థంతో ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. దానికి రష్మి స్పందించింది. `అవును..చాలా మందికి ఇలా అనడం చాలా సులభం` అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాస్టోరీస్‌లో రష్మి పంచుకోవడం విశేషం.
హీరోయిన్లు స్టార్లుగా ఎదిగేందుకు క్యాస్టింగ్ కౌచ్‌ని ఫేస్ చేసి ఉంటారని, అందుకు ఒప్పుకోవడం వల్లే టాప్‌హీరోయిన్లు అవుతారనే నెటిజన్ల కామెంట్లకి ఆమె తనదైన స్టయిల్‌లో స్పందించింది. కెరీర్‌లో రాణించే క్రమంలో హీరోయిన్లు ఎంత స్ట్రగుల్ అవుతారో మీకేం తెలుసు అనే కోణంలో రష్మి ఈ పోస్ట్ పెట్టిందంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.దీంతో ఇప్పుడిది నెట్టింట హల్‌చల్ చేస్తుంది. Rashmi on Casting Couch.
రష్మి గతంలోనూ `క్యాస్టింగ్ కౌచ్`పై స్పందించింది. రష్మి గతంలో `అంతకు మించి` అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది. అవకాశం ఇస్తానంటే వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి అవకాశానికి తను `క్యాస్టింగ్ కౌచ్` అనే పేరు పెట్టననీ, దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది.
కెరీర్ బాగుంటుందనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది. అవకాశం కోసం ఒకరు, అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు పరస్పరం అంగీకారంతో జరిగేదానికి `క్యాస్టింగ్ కౌచ్` అని పేరు పెట్టడం ఏంటంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. `కాస్టింగ్ కౌచ్` ప్రతి రంగంలో ఉంటుందని కానీ సినీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా ఉంటుందని, తనతో మాత్రం ఏ నిర్మాత తప్పుగా ప్రవర్తించలేదని.. నిర్మాతకి, తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయని చెప్పింది రష్మీ. అప్పట్లో రష్మి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ప్రస్తుతం రష్మి `జబర్దస్త్` షోకి యాంకర్‌గా ఉన్నారు. ఇందులో సుడిగాలి సుధీర్‌తో ఆమె నడిపించే కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. రష్మి ఓ సినిమాలోనూ నటించగా, అది వాయిదా పడింది.