- Home
- Entertainment
- `జబర్దస్త్` కొత్త యాంకర్ రెడ్ గౌన్‌లో పిచ్చెక్కించే పోజులు.. గ్లామర్ షోలో పాత యాంకర్లని మించిపోతుందిగా!
`జబర్దస్త్` కొత్త యాంకర్ రెడ్ గౌన్‌లో పిచ్చెక్కించే పోజులు.. గ్లామర్ షోలో పాత యాంకర్లని మించిపోతుందిగా!
`జబర్దస్త్`ని దాదాపు తొమ్మిదేళ్ల పాటు రష్మి గౌతమ్, అనసూయ యాంకర్లుగా రచ్చ చేశారు. ఇప్పుడు అనసూయ స్థానంలో కన్నడ నటి సౌమ్య రావు యాంకర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే తనదైన స్టయిల్‌తో దుమ్మురేపుతుంది.

`జబర్దస్త్`(Jabardasth) షోకి సౌమ్య రావు(Sowmya Rao) యాంకర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే రచ్చ చేస్తూ హైలైట్ అవుతుంది. అదే సమయంలో గ్లామర్ ఫోటోలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకునే పనిలో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ `జబర్దస్త్` షో కోసం ముస్తాబైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
గురువారం `జబర్దస్త్` షో ఈటీవీలో టెలికాస్ట్ అవుతుందనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసింది సౌమ్య రావు. ఇందులో రెడ్ డ్రెస్‌లో మైండ్ బ్లో చేస్తుందీ హాట్ బ్యూటీ. నాజూకు అందాలతో కనువిందు చేసే ఈ భామ ఇప్పుడు రెడ్ గౌన్‌లో మరింత హాట్‌గా ఉంది. `జబర్దస్త్` ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంది. Jabardasth Anchor Sowmya Rao.
మోకాళ్లపైకున్న గౌనులో చిలిపి పోజులిచ్చింది. జబ్బలపై కాస్త జారేలా, క్లీవేజ్ అందాల దోబూచులాటతో, చిలిపి నవ్వులతో ఆమె ఇచ్చిన పోజులు, పంచుకున్న ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట రచ్చ లేపుతున్నాయి.
`జబర్దస్త్` కి కొత్త యాంకర్ అంటే అందరిలోనూ ఓ తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది. దీంతో సౌమ్య రావు పంచుకున్న ఫోటోలనుచూసేందుకు నెటిజన్లు ఎగబడుతుండటం విశేషం. ఆమె పిక్స్ ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆమె అందాన్ని చూస్తూ కళ్లు ఆర్పలేకపోతున్నానని, చూపు తిప్పుకోలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.
కర్నాటకకి చెందిన సౌమ్య రావు టీవీ సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేసి ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆ మధ్య ఈటీవీ 27ఏళ్ల ఫంక్షన్‌లో హైలైట్‌గా నిలిచింది సౌమ్య రావు. హైపర్ ఆదితో జరిగిన కన్వర్జేషన్‌లో బ్యాక్ టూబ్యాక్ పంచ్ లేసి హైలైట్ అయ్యింది. హైపర్ ఆదికే చుక్కలు చూపించింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా `జబర్దస్త్`కి యాంకర్‌గానే వచ్చి మరింత సర్ప్రైజ్ చేసింది. ఆమె లుక్ ఆమెప్రత్యేకత. ఆమె తెలుగు మాట్లాడే తీరు మరింత ఆకట్టుకుంటుంది. తెలుగు సరిగ్గా రాకపోవడమే యాంకర్ల సక్సెస్ అనేట్టుగా మారిపోయిన నేపథ్యంలో సౌమ్య రావుకది ప్లస్ అయ్యింది. క్యూట్ క్యూట్‌గా మాట్లాడే తీరు మరింతగా ఆకర్షిస్తుంది. దీంతో సౌమ్య రావు మాటలకోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తుండటం విశేషం. మరి ఈ భామ రష్మి, అనసూయ అంతటి క్రేజ్‌ని సంపాదించుకుంటుందా? అనేది చూడాలి.