- Home
- Entertainment
- కొత్తింట్లోకి అడుగుపెట్టిన కెవ్వు కార్తీక్.. ఇల్లు చూస్తే `జబర్దస్త్` అనాల్సిందే.. తారల హంగామా!
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కెవ్వు కార్తీక్.. ఇల్లు చూస్తే `జబర్దస్త్` అనాల్సిందే.. తారల హంగామా!
`జబర్దస్త్`తో కమెడీయన్‌గా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న కెవ్వు కార్తీకి ఓ ఇంటివాడయ్యాడు. ఆయన కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఇంద్రజ, సాయికుమార్, రచ్చరవి, లాస్య వంటి సినీ ప్రముఖులు, జబర్దస్త్ కమెడీయన్లు పాల్గొని సందడి చేశారు.

`జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీ షోతో అందర్నీ నవ్విస్తూ ప్రేక్షకుల దగ్గరయ్యాడు కెవ్వు కార్తీక్. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఆయన టీవీలో స్టార్ కమెడీయన్‌గా ఎదిగారు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ దూసుకుపోతున్నారు. `జబర్దస్త్`లో టాప్ కమెడీయన్లలో ఒకరిగా రాణిస్తున్నాడు కెవ్వు కార్తీక్. ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఒక్కో రూపాయి కూడబెట్టుకుని ఆయన ఇప్పుడు సొంతంగా ఓ పెద్ద భవంతిని నిర్మించుకోవడం విశేషం.
ఇటీవల తన సొంతింట్లోకి గృహ ప్రవేశం చేశారు కెవ్వు కార్తీక్. తాజాగా విడుదలైన `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఇంటి గృహ ప్రవేశానికి జడ్జ్ ఆమని, రోజాలను ఆయన ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా ఆమని, కార్తీక్ మధ్య జరిగిన ఫుడ్ కన్వర్జేషన్ పంచ్‌లు నవ్వులు పూయించారు. అనంతరం కార్తీక్ ఇంటిని, గృహ ప్రవేశ దృశ్యాలను ప్రోమోలో చూపించారు.
భారీ స్థాయిలో నిర్మించిన ఈ కొత్త భవంతి కొత్త హంగులతో ఉండటం విశేషం. ఈ గృహ ప్రవేశానికి నటి, జడ్జ్ ఇంద్రజ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆమెతోపాటు సాయికుమార్, రచ్చ రవి, ధన్‌రాజ్, యాంకర్ లాస్య, మరో యాంకర్ వింధ్యా మేడపాటి వంటి వారు హాజరై సందడి చేశారు. రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా వీరి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిన్న చిన్న ఉద్యోగాలు, ఈవెంట్లు చేస్తూ జీవితాన్ని గడుపుతున్న కార్తీక్ కి `జబర్దస్త్` లైఫ్ ఇచ్చింది. ఈ షోలోకి అడుగుపెట్టాక ఆయన జీవితమే మారిపోయింది. మొదట్లో వందల్లో ఉన్న ఆయన పారితోషికం వేలల్లోకి ఇప్పుడు లక్షల్లోకి మారింది. ప్రస్తుతం ఆయన వారానికి రెండు లక్షల వరకు పారితోషికంగా అందుకుంటున్నట్టు తెలుస్తుంది. తన టీమ్ కి అతనే లీడర్ కావడం విశేషం.
ఈ సందర్భంగా కెవ్వు కార్తీక్ లైఫ్ గురించి చూస్తే, వరంగల్ జిల్లాలోని ఖానాపుర్ మండలం, బుద్దారావ్‌పేట్ గ్రామంలో జన్మించిన కార్తీక్ టెన్త్ క్లాస్ వరకూ సొంత ఊరులోనే చదివాడు. నర్సంపేటలో ఇంటర్మీడియట్, హన్మకొండలో డిగ్రీలో జాయిన్ అయి ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో చేరాడు. వరంగల్‌లో రామప్ప ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీ టెక్ చేస్తూనే కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లమా చేశాడు. ఎంటెక్ కూడా పూర్తి చేశాడు.
వాళ్ల నాన్న ఆర్టీసీ కండక్టర్, అమ్మ మిషిన్ కుట్టేది. ఇద్దరు అక్కలు. వారి పోషణ, స్టడీస్‌కి, అప్పుల కోసం ఇంటిని అమ్మేయాల్సిన పరిస్థితి. స్టడీ పూర్తయిన తర్వాత జాబ్ చేస్తూ సాలరీ సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.
దీంతో ప్రైవేట్ ఈవెంట్ల వైపు మొగ్గు చూపాడు. ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేవాడు. మిమిక్రీ చేయడం వల్ల బాగా డబ్బులు వచ్చేవట. ఆ తర్వాత జీ తెలుగులో `కామెడీ క్లబ్`లో చేరాడు. ఆ తర్వాత మా గోల్డ్ లో ఓ షో, టీవీ 1లో మిమిక్రీ ఆర్టిస్టుగా, ఆ తర్వాత యాంకర్ సుమ ప్రోత్సాహంతో ఈటీవీలో `కెవ్వుకేక`, `తఢాఖా`షోలో చేశాడు.
ఈ క్రమంలోనే ఈటీవీలో `జబర్దస్త్` షో ప్రారంభమైంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో కొత్త వారిని తీసుకుంటుండగా, కెవ్వు కార్తీక్‌కి ఆఫర్ వచ్చింది. అలా తను జబర్దస్త్ లోకి అడుగుపెట్టి ఇప్పటి వరకు కమెడీయన్‌గా రాణిస్తున్నారు. టీమ్ లీడర్‌గా ఎదిగారు. పలు సినిమా ఆఫర్లు కూడా ఆయన్ని వరిస్తుండటం విశేషం.
`జబర్దస్త్`తో కమెడీయన్‌గా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న కెవ్వు కార్తీకి ఓ ఇంటివాడయ్యాడు. ఆయన కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఇంద్రజ, సాయికుమార్, రచ్చరవి, లాస్య వంటి సినీ ప్రముఖులు, జబర్దస్త్ కమెడీయన్లు పాల్గొని సందడి చేశారు.