- Home
- Entertainment
- దాచుకున్న మొత్తం డబ్బులు లాగేసుకున్నారు... జబర్దస్త్ వినోద్ కి జరిగిన మోసం తెలిస్తే గుండెలు మండుతాయి!
దాచుకున్న మొత్తం డబ్బులు లాగేసుకున్నారు... జబర్దస్త్ వినోద్ కి జరిగిన మోసం తెలిస్తే గుండెలు మండుతాయి!
జబర్దస్త్ కమెడియన్ వినోద్ తనకు జరిగిన అన్యాయం గురించి జనాలకు తెలియజేశాడు. తన సంపాదన, అమ్మా నాన్నల సేవింగ్స్ తో సహా మొత్తం డబ్బులు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు.

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో వినోద్ అలియాస్ వినోదిని ఒకడు. ఇతడు లేడీ గెటప్స్ కి చాలా ఫేమస్. జబర్దస్త్ స్కిట్స్ లో కేవలం లేడీ గెటప్స్ మాత్రమే వేసేవాడు. మంచి హైట్, ఒద్దుపొడుగున్న వినోద్ లేడీ గెటప్ లో చాలా అందంగా ఉండేవాడు. వినోద్ ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్స్ లో భార్య రోల్స్ చేశాడు. ఇతర టీమ్ లీడర్స్ తో కూడా పని చేశాడు.
Jabardasth Vinod
కొన్నాళ్లుగా జబర్దస్త్ వేదికపై వినోద్ సందడి తగ్గింది. దీంతో చాలామంది కమెడియన్స్ మాదిరి ఆయన కూడా మానేశారని అభిమానులు భావించారు. అయితే తాజా ఇంటర్వ్యూతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు స్వయంగా తెలియజేశాడు.
Jabardasth Vinod
వినోద్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ జి గురయ్యాడట. సమస్య పెద్దది కావడంతో ఆయన చాలా రోజులు చికిత్స తీసుకున్నాడట. వినోద్ లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఆయన ముఖం నల్లగా మారిపోయి కళావిహీనం తయారైంది. జుట్టు ఊడిపోయింది. అలా జరగడానికి అనారోగ్యమే అని వినోద్ వెల్లడించారు. మెడిసిన్ కారణంగా జుట్టు ఊడిపోయిందని చెప్పుకొచ్చాడు.
Jabardasth Vinod
ఆర్థికంగా కూడా భారీగా మోసపోయినట్లు వినోద్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమ్మానాన్నల సేవింగ్స్, తన సంపాదనతో ఇల్లు కొనుక్కుందాము అనుకోని అంతా కోల్పోయినట్లు వినోద్ ఆవేదన చెందాడు. వినోద్ అద్దెకు ఉంటున్న ఇంటిని కొనుగోలు చేయాలని భావించాడు. ఇంటి ఓనర్ ఇల్లు అమ్ముతా అనడంతో బేరం కుదుర్చుకొని అతనికి అడ్వాన్స్ గా రూ. 13 లక్షలు వినోద్ ఇచ్చాడు. ఓనర్ ఇల్లు అమ్మకపోగా వినోద్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
Jabardasth Vinod
ఆ డబ్బుల విషయంలో ఎంత పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని వినోద్ బాధపడ్డారు. అలాగే తెలిసిన మరో వ్యక్తి అప్పు తీసుకుంటే నేను మధ్యలో షూరిటీగా ఉన్నాను. డబ్బులు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న నేను రూ. 5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆసుపత్రి ఖర్చులతో పాటు ఇతర కారణాలతో మరో రూ. 3 లక్షలు ఖర్చు అయ్యాయి. మొత్తంగా కడుపు కట్టుకొని పోగొచేసిన రూ. 21 లక్షలు పోగొట్టుకున్నాను, అని వినోద్ తన దీనగాథ, జరిగిన అన్యాయం వివరించాడు.
Jabardasth Vinod
వినోద్ డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఇంటి ఓనర్ గతంలో దాడి చేశాడు. ఆ దాడిలో వినోద్ కంటికి తీవ్ర గాయమైంది. కొన్నాళ్ల పాటు చికిత్స తీసుకుంటూ... జబర్దస్త్ కి దూరమయ్యాడు. అమాయకుడైన వినోద్ రాత్రింబవళ్లు షూటింగ్స్ లో పాల్గొని కష్టపడి సంపాదించిన మొత్తం సొమ్ము ఇతరుల పాలైంది.