- Home
- Entertainment
- ఒకప్పుడు బాత్‌రూమ్‌లు కడిగిన జబర్దస్త్ కమెడియన్, ఇప్పుడు 200కోట్లకు అధిపతి.. ఎవరో తెలుసా?
ఒకప్పుడు బాత్‌రూమ్‌లు కడిగిన జబర్దస్త్ కమెడియన్, ఇప్పుడు 200కోట్లకు అధిపతి.. ఎవరో తెలుసా?
Jabardasth: జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. వారి జీవితాలనే మార్చేసింది. అలా వచ్చిన ఒక కమెడియన్ ఇప్పుడు రెండు వందల కోట్లకు అధిపతి కావడం విశేషం.

200కోట్లకు ఎదిగిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా?
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. వందల మంది కమెడియన్లని తయారు చేసింది. వారిలో పదుల సంఖ్యల్లో స్టార్ కమెడియన్లుగా రాణించారు. రాణిస్తున్నారు. అంతేకాదు కొందరు హీరోలుగానూ మారిపోయారు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ తెలుగు బుల్లితెర కామెడీ షోస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు 200కోట్లకు అధిపతి అయ్యారు ఓ కమెడియన్. జబర్దస్త్ షోకి రాకముందు బాత్ రూమ్‌లు కడిగిన అతను ఇప్పుడు జబర్దస్త్ లోనే రిచ్చెస్ట్ కమెడియన్‌గా ఎదగడం విశేషం.
కోట్లకు ఎదిగిన జబర్దస్త్ కమెడియన్ కొమరక్క
బాత్ రూమ్‌లు కడితే స్థితి నుంచి రెండు వందల కోట్లకు ఎదిగిన కమెడియన్ ఎవరో కాదు కొమరక్క అలియాస్ కొమరం అలియాస్ కుమార్. జబర్దస్త్ లో లేడీ గెటప్‌లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ గా మహిళా కమెడియన్లే వస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు, మగవాళ్లే లేడీ గెటప్ వేసేవారు. అలా కుమార్ కూడా లేడీ గెటప్ వేసి `కొమరక్క`గా పాపులర్ అయ్యాడు. స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అయితే ఆయన ఒకప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేశాడు. కుమార్ 10వ తరగతి అయిపోయాక హైదరాబాద్ వచ్చేశాడు. అప్పట్లో శంషాబాద్ వైపు భూములకు పెద్దగా రేట్లు లేవు. ఎయిర్ పోర్ట్ రాలేదు. భూమి కూడా వ్యవసాయానికి ఉపయోగకరంగా లేదు. దీంతో డబ్బులు సంపాదించడం కోసం ఆయన సిటీకి వచ్చాడు.
హోటల్స్ లో పనిచేస్తూ బేగంబజార్‌లో నైటీలు అమ్ముతూ
మొదట్లో హోటల్స్ లో పనిచేశాడు కొమరం. ఛార్మినార్, కామత్, ఉడిపి, ఇలా చాలా హోటల్స్ లో పనిచేశాడు కుమార్. ఎనిమిదేళ్లు ఈ హోటళ్లలో వర్క్ చేసినట్టు తెలిపాడు. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు కుమార్. హోటల్స్ లో పనిచేసేటప్పుడు కిరాణా షాప్ కూడా పెట్టాడట. తన హోటల్ స్టాఫ్‌కే కిరాణ సమాను సేల్ చేసినట్టు చెప్పాడు. డ్యూటీ అయిపోయాక బేగంబజార్ వచ్చి పర్సులు కూడా అమ్ముకున్నాడట. అంతేకాదు నైటీలు, గొడుగులు కూడా అమ్ముకున్నాడట. అప్పుడు తనకు ఉన్నది ఒక్కటే లక్ష్యం.. ఇంటిని, కుటుంబాన్ని, అన్నింటిని వదులుకుని వచ్చాను. టైమ్ వేస్ట్ చేయోద్దని చెప్పి దొరికన పనిచేసుకుంటూ వచ్చినట్టు తెలిపాడు కుమార్.
సంపాదించిందంతా ల్యాండ్‌పై పెట్టిన కొమరం
అప్పట్లో తన నాన్నకి ఇరవై ఎకరాల భూమి ఉండేదట. కానీ ఆయన అమ్ముకున్నాడట. చివరికి ఐదు ఎకరాలే మిగిలి ఉంది. ఎలాగైనా భూమి సంపాదించాలని, ఎంతో కష్టపడి, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా, సంపాదించినది మొత్తం భూమిపైనే ఖర్చు చేశాడు. ల్యాండ్ కొనుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ రావడంతో అక్కడ భూములు రేట్లు పెరిగాయి. దీంతో కోట్లకి అధిపతి అయ్యాడు కొమరక్క అలియాస్ కుమార్. తన ల్యాండ్ వ్యాల్యూ రెండు వందల కోట్లు ఉంటుందని యాంకర్ శివ చెప్పడం విశేషం. అయితే తాను కష్టపడి కొన్నాను, లక్కీగా రేట్లు పెరిగి అలా వచ్చేసిందని చెప్పాడు కుమార్. దీంతో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లలోనే కొమరం రిచ్చెస్ట్ కమెడియన్ అని యాంకర్ శివ చెప్పడం విశేషం.
జబర్దస్త్ లోకి ఎలా వచ్చానంటే?
ఈ సందర్భంగా తాను జబర్దస్త్ లోకి ఎలా వచ్చావనేది చెబుతూ, కొన్నేళ్లు సిటీలో పనిచేశాక ఇంటికి వెళ్లిపోయాడు కుమార్. పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ విడిపోయింది. హమాలీ పని కూడా చేశాడట. ఆ టైమ్‌లో బాత్ రూమ్‌లు కూడా కడిగినట్టు తెలిపాడు. ఈ మోటు పని ఎన్ని రోజులు సినిమాలంటే ఇష్టం కదా, అక్కడ ట్రై చేయమని భార్య ప్రోత్సహించిందట. అంతేకాదు ఐదేళ్లు నెలకు మూడు వేలరూపాయలు మనీ కూడా పంపించిందట. అలా తనకి అసెట్ గా ఉన్న మిమిక్రీ చేస్తూ, దాన్నుంచి టీవీ ఛానెల్, ఛానెల్ నుంచి జబర్దస్త్ లోకి వెళ్లినట్టు తెలిపాడు. జబర్దస్త్ తన లైఫ్ నే మార్చేసిందని వెల్లడించాడు కుమార్ అలియాస్ కొమరక్క. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.