విడుదలకు ముందే అదిరే అభి మూవీ నెట్టింట్లో... పోలీసులను ఆశ్రయించిన జబర్ధస్త్ కమెడియన్స్!

First Published Jan 12, 2021, 4:10 PM IST

సినిమా అనేది చాలా మందికి ఒక కల. దాని కోసం ఏళ్ల తరబడి తపస్సు చేయాల్సి ఉంటుంది. అనేక వ్యయ ప్యాసల కోర్చి, కోట్లు ఖర్చుపెట్టి మూవీ చేస్తే కొందరు నేరగాళ్లు ఈజీగా దాన్ని కొట్టేస్తున్నారు. అదిరే అభి హీరోగా నటించిన మొదటి చిత్రం విషయంలో కూడా అదే అయ్యింది. 
 
అదిరే అభి హీరోగా తెరకెక్కిన చిత్రం పాయింట్ బ్లాంక్. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు వి వి ఎస్ జి తెరకెక్కించారు. ఈ మూవీలో సీరియల్ మర్డర్స్ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసు పాత్రను అదిరే అభి చేశారు.

మరో జబర్ధస్త్ కమెడియన్ గడ్డం నవీన్, సూర్య, జీవా మరియు శేఖర్ కీలక పాత్రలు చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన పాయింట్ బ్లాంక్ ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకుంది.

సినిమాపై పాజిటివ్ బజ్ నేపథ్యంలో మూవీ విజయంపై చిత్ర యూనిట్ విశ్వాసంతో ఉన్నారు. వీళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ... నెట్ లో పాయింట్ బ్లాంక్ మూవీ నెట్ లో ప్రత్యక్షం అయ్యింది.

అనేక కీలక సన్నివేశాలు ఇంటర్నెట్ లో చూసి హీరో అదిరే అభి మరియు చిత్ర నిర్మాతలు షాక్ అయ్యారట. వెంటనే సదరు వీడియోలు నెట్లో నుండి తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

అదిరే అభి మరియు గడ్డం నవీన్ తమ సినిమాను దొంగిలించి ఇంటర్నెట్ లో విడుదల చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని,  సదరు సన్నివేశాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారట.

భారీ బడ్జెట్ చిత్రాలకు సైతం ఈ బెడద తప్పడం లేదు. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఇలా రెచ్చిపోతున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ నుండి కూడా కొన్ని సన్నివేశాలు లీకైనట్లు సమాచారం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?