- Home
- Entertainment
- మరోసారి తల్లి అవ్వాలని ఉందంటూ మనసులోని కోరిక బయటపెట్టిన అనసూయ.. కూతురు పుట్టాలని దేవుడిని వేడుకుంటూ కన్నీళ్లు
మరోసారి తల్లి అవ్వాలని ఉందంటూ మనసులోని కోరిక బయటపెట్టిన అనసూయ.. కూతురు పుట్టాలని దేవుడిని వేడుకుంటూ కన్నీళ్లు
అనసూయ `జబర్దస్త్` యాంకర్‌గా, నటిగా రాణిస్తుంది. గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ అమ్మడిలో తెలియని మరో కోణం ఉంది. తన మనసులోని భావాన్ని, బాధని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

హాట్ యాంకర్‌గా తెలుగు టీవీ రంగంలో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, నటిగానూ రాణిస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకుంది. యాంకర్‌గా అనసూయకి ఉన్న క్రేజ్ మరే యాంకర్‌కి కూడా లేదంటే అతిశయోక్తి లేదు. `జబర్దస్త్` షోలో యాంకర్‌గా అలరిస్తూనే, మరోవైపు తన గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తుంది.
అనసూయ అందాల ఫోటోలకు ఇంటర్నెట్ ఫుల్ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఆమె కొత్త ఫోటోలు పంచుకోవడమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుంటాయి. అయితే అదే సమయంలో ఆమె పలు విమర్శలకు గురవుతుంటుంది. ఆమె డ్రెస్‌పై తరచూ కామెంట్స్ వస్తుంటాయి. వాటిపై అంతే ఘాటుగా స్పందిస్తూ కౌంటర్లిస్తుంది అనసూయ. ఇది ఇప్పుడు కామన్ అయిపోయిందని చెప్పొచ్చు.
అయితే షోస్‌లో నవ్వుతూ, అందరిని నవ్విస్తూ ఆకట్టుకుంటున్న అనసూయలో లేటెస్ట్ గా తన మనసులోని కోరికని బయటపెట్టింది. `జబర్దస్త్` షోతో అలరిస్తున్న అనసూయని చాలా రోజులుగా ఓ బాధ వెంటాడుతుంది. తాజాగా ఆ విషయాన్ని ఓపెన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. ఆమె చెప్పిన విషయం అందరిని కదిలిస్తుండటం విశేషం.
ఈటీవీలో శ్రీరామ నవమి పండుగని పురస్కరించుకుని `సీతారాముల కళ్యాణం చూతము రారండి` అనే స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో జబర్దస్త్ కమెడీయన్లంతా పాల్గొన్నారు. జంటలుగా పాల్గొని సందడి చేశారు. శ్రీరాముడు, సీతల గొప్పతనాన్ని తెలిపారు. వారికి గ్రాండ్‌గా కళ్యాణం చేశారు. ఈ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
అనంతరం అనసూయ ఓ పాపని ఎత్తుకుని లాలిస్తూ, ముద్దాడుతూ కనిపించింది. పాపని చూస్తూ ఎంతగానో మురిసిపోతుంది అనసూయ. ఈ సందర్భంగానే అనసూయలోని బాధని బయటపెట్టింది మరో యాంకర్ రష్మి. ప్రస్తుతం అనసూయకి ఇద్దరు కుమారులున్నారని, కానీ ఆమె కూతురు కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది రష్మి.
అనసూయ `తనకు ఓ ఆడపిల్ల కావాలని ఎప్పట్నుంచి కోరుకుంటుంది` అని వెల్లడించింది రష్మి. దీనికి అనసూయ కన్నీళ్లు పెట్టుకుంది. ఏదో ఒక రోజు తనకు కూతురు పుడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపి అందరి ముందు ఎమోషనల్ అయ్యింది అనసూయ. దీనికి ప్రదీప్ తదాస్తు అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ప్రోమోలో ఈ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆడియెన్స్ ని కదిలిస్తున్నాయి. అనసూయలోని మరో కోణాన్ని చూసి చలించిపోతున్నారు.