MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ పై వ్యతిరేకత రాకుండా హనుమంతుడిని రంగంలోకి దించిన రాజమౌళి... స్టోరీ సెలక్షన్ వెనుక భారీ స్కెచ్!

మహేష్ పై వ్యతిరేకత రాకుండా హనుమంతుడిని రంగంలోకి దించిన రాజమౌళి... స్టోరీ సెలక్షన్ వెనుక భారీ స్కెచ్!

మహేష్ బాబును రాజమౌళి మోడరన్ హనుమంతుడిగా చూపించనున్నాడనే చర్చ జరుగుతుంది. మహేష్ కోసం రాజమౌళి ఈ కథను ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ ఓ వాదన బయలుదేరింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 13 2023, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


సూపర్ స్టార్ మహేష్ భారీ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కథపై మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే జంగిల్ అడ్వెంచర్ స్టోరీ అన్నారు. అలాగే ఈ చిత్రంలో మహేష్ పాత్రకు రామాయణంలో హనుమంతుడు పాత్ర ఆధారమని వెల్లడించారు. కాబట్టి మహేష్ రోల్ హనుమంతుడి పాత్రను ప్రతిబింబించేదిగా ఉంటుందట. హనుమంతుడు ఫీచర్స్ అయిన బలం, సాహసం, తెగింపు, స్వామి భక్తి, విశ్వాసం మహేష్ క్యారెక్టర్లో చూడవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.  

25

మహేష్ కోసం ఈ స్టోరీ ఎంచుకోవడం వెనుక రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఉందట. నార్త్ ఇండియాలో హనుమాన్ సెంటిమెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆయన ఆలోచనట. రామాయణం, రాముడు, హనుమంతుడు నార్త్ ఇండియన్స్ బలమైన సెంటిమెంట్స్ గా ఉన్నాయి. ఆ కోణంలో ఆడియన్స్ ని ఆకర్షించే పాయింట్ అవుతుందని ఆయన నమ్మకం కావచ్చనే వాదన వినిపిస్తోంది. అలాగే మహేష్ చేసిన ఓ కామెంట్ ఆయనపై నార్త్ సర్కిల్స్ లో నెగిటివిటీకి కారణమైంది. ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన బాలీవుడ్ నన్ను అఫ్ఫార్డ్ చేయలేదు. అందుకే హిందీ చిత్రాలు చేయడానికి ఆసక్తి లేదన్నారు.

35

ఈ కామెంట్ వెనుక మహేష్ ఉద్దేశం ఏదైనా కానీ... బాలీవుడ్ మాత్రం తనకు రెమ్యూనరేషన్ ఇచ్చే స్థాయిలో హిందీ పరిశ్రమ లేదని అన్నట్లు ఊహించుకున్నారు. ఈ క్రమంలో మహేష్ మీద నార్త్ ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. కాబట్టి మహేష్-రాజమౌళి చిత్రానికి బాయ్ కాట్ ట్రెండ్స్ ఎదురుకావచ్చు. దూర దృష్టి కలిగిన రాజమౌళి ఆ ప్రమాదం రాకుండా హనుమాన్ సబ్జెక్టు వెలుగులోకి తెచ్చారని, మహేష్ కోసం అలాంటి కథ ఎంపిక చేశారని అంటున్నారు. హనుమాన్ ని అమితంగా ఆరాధించే నార్త్ ఇండియన్స్ మహేష్ కామెంట్స్ మరచి దేవుడు పాయింట్ కి కనెక్ట్ అవుతారని రాజమౌళి భావిస్తున్నారట.  ఈ మేరకు పరిశ్రమలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. 
 

45

ప్రచారంలో ఉన్న వార్తలు నిజమైతే మహేష్ మోడరన్ హనుమాన్ గా కనిపించనున్నారు. హనుమంతుడు ఎపిసోడ్ హైలెట్ గా ఉండే రామాయణంలోని ఒక కాండం లేదా కొన్ని కాండాల సమాహారంగా మహేష్ పాత్ర, స్క్రీన్ ప్లే రాసుకొని ఉండొచ్చు. చెప్పాలంటే సీతను రావణుడు అపహరించినప్పటి నుండి హనుమంతుడు పాత్రకు రామాయణంలో ప్రాధాన్యత ఉంటుంది. అప్పటి నుండే హనుమంతుడు పాత్ర ఎలివేట్ అవుతుంది. రావణాసుర వధ వరకు హనుమంతుడు రోల్ వీరోచితంగా సాగుతుంది. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పాత్రను, కథ కథనాలను ఎలా తీర్చిదిద్దారనేది చూడాలి.

55

ఆర్ ఆర్ ఆర్ మూవీ సైతం ఇద్దరు తెలుగు వీరుల నిజ జీవితాల స్పూర్తితో రాసుకున్నారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు రియల్ లైఫ్ నుండి ఒక ఫిక్షనల్ స్టోరీ డెవలప్ చేశారు. అది సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేసింది. రాజమౌళి కీర్తి మరో స్థాయికి తీసుకెళ్లింది. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే... మహేష్ ప్రాజెక్ట్ ని రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. రూ. 2100 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Recommended image2
Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Recommended image3
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved