అమీర్, అక్షయ్, నితిన్, నిఖిల్ ... ఈవారం ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు
పోయిన నెల జూలైలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాని ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ ను సంతోషపెట్టలేదు. దాంతో టాలీవుడ్ విజయ పరంపరకు జులై లో బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇక ఈసారి మాత్రం మేమున్నామంటూ ఆగస్టును టాలీవుడ్ కు లక్కీ మన్త్ చేయడానికి వస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇక ఈ వారం రిలీజ్ కు ఉన్న సినిమాలేంటో చూసేద్దాం

ఇప్పటికే అగస్ట్ ఫస్ట్ వీక్ లో శుభారంభం చేసేశారు కల్యాన్ రామ్, దుల్కర్ సల్మాన్. ఒకేరోజు రిలీజైన బింబిసార, సీతారామం రెండూ సినిమాలు విజయ పతాకం వెగరవేసి.. బాక్సాఫీస్ కు ఊపిరి ఊదారు. ఇక అదే ఊపుతో మేము కూడా రెడీ అంటున్నాయి మరికొన్ని సినిమాలు. ఆగస్టు రెండో వారంలో అటు థియేటర్‌లో, రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం
ఈ వారం 11, 12 తేదీల్లోనే థియేటర్లకు సినిమాల ప్లోటింగ్ స్టార్ట్ కాబోతోంది. అందులో ముఖ్యంగా 11న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ చేసిన లాల్ సింగ్ చడ్డా రిలీజ్ కాబోతోంది. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మన టాలీవుడ్ యంగ్ స్టార్ నాగచైతన్య ఇంపార్టెంట్ రోల్ చేశారు. హాలీవుడ్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లను పలకరించనుంది. అంతే కాదు ఈసినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే.. ఈసినిమాను తెలుగు మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. దాంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈనెల 11న రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకుని రిలీజ్ కాబోతోంది రక్షా బంధన్ సినిమా. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈసినిమా ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. అన్న చెల్లెల్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సాగే ఈసినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోన్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ సారి సాలిడ్ హిట్ కోసం ప్రయత్నంచేస్తున్నాడు. అండుకే తను కంప్లీట్ గా జాన్ మార్చేశాడు. ఈసారి ప్యాక్షన్ స్టోరీతో రాబోతున్నాడు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృతీశెట్టి, కేథరిన్ నితిన్ కు జోడీగా నటించారు. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడిన.. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజవుతోంది.
ఇక చాలా గ్యాప్ తరువాత రాబోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈసారి పక్కా ప్లాన్ చేసుకుని. సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ 2 తో రాబోతున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాను ముందు అగస్ట్ 12 రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ అదేరోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ రిలీజ్ అవుతుండటంతో... ఒకరోజు ఆగి కార్తికేయ 2 ను ఆగస్టు 13న ప్రపం వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. అన్ని ప్లాట్ ఫామ్స్ లో బోలెడు వెబ్ సిరీస్ లు సందడి చేయబోతున్నాయి. ఇక హాట్ స్టార్ లో మాత్రం రీసెంట్ గా రామ్ ,కృతీ శెట్టి జంటగా నటించిన ది వారియర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈనెల 11న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతోంది ది వారియర్ మూవీ. ఈ మూవీతో పాటు అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 20 కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి.