- Home
- Entertainment
- RRR తర్వాత ఎన్టీఆర్ కి బెంగళూరులో భారీగా ఆస్తులు.. నెట్ వర్త్ గురించి తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది ?
RRR తర్వాత ఎన్టీఆర్ కి బెంగళూరులో భారీగా ఆస్తులు.. నెట్ వర్త్ గురించి తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది ?
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా దర్శకనిర్మాతలు తారక్ ని సంప్రదిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 ఖరారైన సంగతి తెలిసిందే.

నందమూరి వారసత్వంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. బాల రామాయణం చిత్రంతో నటనలో ఓనమాలు దిద్దిన తారక్.. యుక్త వయసు వచ్చాక నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి తారక్ జైత్ర యాత్ర మొదలైంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.
క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా దర్శకనిర్మాతలు తారక్ ని సంప్రదిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ముందు వరకు ఎన్టీఆర్ ఒక చిత్రానికి 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పారితోషికం 60 నుంచి 80 కోట్లకు చేరింది. వార్ 2 కోసం తారక్ 80 కోట్లకి పైనే తీసుకుంటున్నట్లు టాక్.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆదాయం కూడా బాగా పెరిగింది. దీనితో ఎన్టీఆర్ ఆస్తుల గురించి ఆసక్తికర ప్రచారం మొదలయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఆదాయాన్ని బెంగుళూరులో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యన ఎన్టీఆర్ హైదరాబాద్ శివారులో శంకర్ పల్లిలో 6 ఎకరాల ఫామ్ ల్యాండ్ ని కొన్న సంగతి తెలిసిందే.
అదే తరహాలో బెంగుళూరులో కూడా తారక్ ఆస్తులు కొంటున్నారట. దాని విలువ 10 కోట్ల వరకు ఉండొచ్చు. అలాగే జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ బంగ్లా ఖరీదు 25 కోట్ల పైమాటే అని టాక్. తారక్ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాక పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. వీటి ద్వారా తారక్ కి నెలకి రూ.3 కోట్ల వరకు అందుతుందని అంటున్నారు.
అలాగే తారక్ ఇండియాలో లాంబోర్గిని కారుని సొంతం చేసుకున్న ఫస్ట్ సిటిజన్. అలాగే తారక్ గ్యారేజ్ లో పదుల సంఖ్యలో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఎన్టీఆర్ నెట్ వర్త్ 400 కోట్లు దాటిందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండాగా ఎన్టీఆర్ 30 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ సంస్థ, నందమూరి కళ్యాణ్ రామ్ కలసి నిర్మిస్తున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.