బుచ్చిబాబు, రాంచరణ్ మూవీ బ్యాక్ డ్రాప్ పై గూస్ బంప్స్ తెప్పించే డీటెయిల్స్..చిన్న ఛాన్స్ కూడా వదలట్లేదు
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో అంశం ఆసక్తిని పెంచేలా ఉంది. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రాంచరణ్ ఆల్రెడీ చెప్పారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో అంశం ఆసక్తిని పెంచేలా ఉంది. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రాంచరణ్ ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆకట్టుకునే బలం ఈ కథలో ఉందని చరణ్ తెలిపాడు.
ఇది పాన్ ఇండియా చిత్రం కాదు పాన్ వరల్డ్ మూవీ అని బుచ్చిబాబు బిగ్ బాస్ సోహైల్ తో తెలిపాడట. అయితే బుచ్చిబాబు చాలా రోజుల నుంచి ఈ చిత్రం కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విజయనగరంలో ఈ కథ జరుగుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర యాసని పక్కాగా మాట్లాడగలిగే నటుల కోసం ఆర్ సి 16 టీమ్ వేట మొదలు పెట్టారు.
ఈ చిత్రంలో మాట్లాడే భాష విషయంలో తాము కాంప్రమైజ్ కావడం లేదని.. చాలా అథెంటిక్ ఉండడం కోసం భాషని సహజంగా మాట్లాడే వారికోసం వెతుకుతున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ చిత్రం కథ కబడ్డీ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు చాలా రా అండ్ రస్టిక్ గా గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ తో తెరకెక్కించబోతున్నారట. ఉప్పెన చిత్రంతో సాహసోపేతమైన పాయింట్ ని కన్విన్స్ చేసిన బుచ్చిబాబు ఇలాంటి పవర్ ఫుల్ కథతో ఇంకెలాంటి మ్యాజిక్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కబడ్డీ బ్యాక్ డ్రాప్ అనేది విస్తృతంగా జరుగుతున్న ప్రచారం.. అయితే కథలో కబడ్డీ ఉంటుందని కానీ అదే మెయిన్ బ్యాక్ డ్రాప్ కాదని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా రాంచరణ్, బుచ్చిబాబు మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ చిత్రం చాలా కాలంగా ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజుని, శంకర్ ని ట్రోల్ కూడా చేశారు. ఆలస్యం అయ్యే కొద్దీ సినిమాపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందనేది చరణ్ ఫ్యాన్స్ వాదన.