MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రిసెప్షన్ వేడుకలో అత్తగారికి లిప్ కిస్ ఇచ్చిన కమెడియన్ అల్లుడు..తీవ్ర వివాదంలో కొత్త పెళ్ళికొడుకు ?

రిసెప్షన్ వేడుకలో అత్తగారికి లిప్ కిస్ ఇచ్చిన కమెడియన్ అల్లుడు..తీవ్ర వివాదంలో కొత్త పెళ్ళికొడుకు ?

తమిళ నటుడు రోబో శంకర్ బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అతడికి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రోబో శంకర్ కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా నటిస్తున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 04 2024, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ నటుడు రోబో శంకర్ బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అతడికి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రోబో శంకర్ కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా నటిస్తున్నాడు. మారి, వాయై మూడి పేశవం, విశ్వాసం, ఎలెన్ను వందుట్టా వెల్లైకారన్ లాంటి చిత్రాలతో రోబో శంకర్ పాపులర్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ మధ్యన రోబో శంకర్ కామెర్లు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. ఉన్న పళంగా చాలా బరువు తగ్గిపోయాడు. చాలా రోజులు చికిత్స తర్వాత రోబో శంకర్ కోలుకున్నాడు. అధికంగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల శంకర్ ఇలా కామెర్లకి గురైనట్లు తెలుస్తోంది. రోబో శంకర్ బాగా సన్నగా అవడంతో అతడి లుక్ కి అభిమానులు షాక్ అయ్యారు. 

36

రోబో శంకర్ సతీమణి పేరు ప్రియాంక శంకర్. వీరికి ఇంద్రజ శంకర్ అనే కుమార్తె ఉంది. ఇంద్రజ శంకర్ కూడా కోలీవుడ్ లో నటిగా రాణిస్తోంది. ఆమె విజయ్ బిగిల్ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించిన సంగతి తెలిసిందే.  విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో మెరిసింది. ఇప్పుడు ఆమె 20 ఏళ్ళ వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 

46

తమిళనాట దర్శకుడిగా రాణిస్తున్న కార్తీక్ తో ఇంద్రజ శంకర్ వివాహం జరిగింది. ఇటీవల వైభవంగా వివాహ వేడుక జరిగింది. కాగా రీసెంట్ గా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. వివాహానికి తక్కువ మంది సెలెబ్రిటీలు హాజరు కాగా.. రిసెప్షన్ కి చాలా మంది సెలెబ్రిటీలు సందడి చేశారు. 

56

కమల్ హాసన్, శివకార్తికేయన్ లాంటి సెలెబ్రిటీలంతా రిసెప్షన్ కి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. అయితే రిసెప్షన్ వేడుకలో కొత్త పెళ్ళికొడుకు కార్తీక్ చేసిన పని తీవ్ర వివాదానికి కారణం అయింది. 

66

వేదికపై కార్తీక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోబో శంకర్ సతీమణి ప్రియాంక శంకర్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్తీక్ తన అత్తగారు ప్రియాంకకి లిప్ కిస్ ఇచ్చాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లుడు అత్తగారితో ఆ విధంగానేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కమెడియన్ రోబో శంకర్ అల్లుడు కార్తీక్ చేసిన ఈ పని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved