- Home
- Entertainment
- RRR Movie: రామ్ ఏమాత్రం తడబడ్డా ఆర్ ఆర్ ఆర్ దెబ్బతినేది ... చరణ్ ని లేపి ఎన్టీఆర్ ని తోక్కేసిన సీనియర్ రైటర్
RRR Movie: రామ్ ఏమాత్రం తడబడ్డా ఆర్ ఆర్ ఆర్ దెబ్బతినేది ... చరణ్ ని లేపి ఎన్టీఆర్ ని తోక్కేసిన సీనియర్ రైటర్
ఆర్ ఆర్ ఆర్ విడుదలై నెలలు దాటిపోతున్నా సోషల్ మీడియాలో నందమూరి వర్సెస్ మెగా వార్ నడుస్తూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ లో ఎవరి పాత్ర గొప్ప అనే విషయంలో వాదనలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఎవరికి వారు మేము గొప్ప అనుకుంటున్నారు.

RRR movie
అయితే రాజమౌళి మూవీలో ఎన్టీఆర్(NTR) కంటే చరణ్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చాడని, క్లైమాక్స్ ఫైట్ లో రామ్ ని ఎలివేట్ చేసి, భీమ్ ని తగ్గించాడనే ప్రచారం. అలాగే ఎన్టీఆర్ పై తీసిన కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసి, చరణ్ పాత్రకు ఎక్కువ నిడివి ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. రాజమౌళిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలదీయడంతో పాటు ఫోన్లు చేసి, మెసేజ్లతో దుర్భాషలాడారని కూడా వార్తలు వచ్చాయి.
మరి ఆర్ ఆర్ ఆర్(RRR Movie) లో ఎవరి పాత్ర కీలకం, దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను ఎలా తీర్చిదిద్దాడు అనే విషయాలపై సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఆయన తన అభిప్రాయం తెలియజేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉన్న మాట వాస్తవమే... కానీ పాత్ర నిడివి ఆధారంగా ప్రాధాన్యత నిర్ణయించలేము. పెదరాయుడు మూవీలో క్యామియో రోల్ చేసిన రజినీకాంత్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని పరుచూరి ఉదహరించారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీలో నేను ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan) లను చూడలేదు. కొమురం భీమ్, అల్లూరిని మాత్రమే చూశాను. ఆ రెండు పాత్రలకు దర్శకుడు రాజమౌళి న్యాయం చేశాడు. దర్శకుడు ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఆ రెండు పాత్రలను రెండు కళ్లుగా భావించాడు. ఇద్దరి పరిచయ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడు. రామ్ పాత్ర చరణ్ గొప్పగా చేశారు. అతడు ఓ ఆశయం కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నట్లు ప్రేక్షకులకు అనుమానం రాకుండా నటించారు. విషయం తెలిసే వరకు రామ్ ని బ్రిటిష్ విధేయుడిగానే ప్రేక్షకులు భావిస్తారు.
ఆ ముసుగుకు సంబంధించిన నటనలో రామ్ చరణ్ ఏమాత్రం తడబడినా ఆర్ ఆర్ ఆర్ పై ప్రభావం పడేది. ఆయుధాల కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడనే అనుమానం ప్రేక్షకులకు రాకుండా చరణ్ నటించాడు అన్నారు. పరుచూరి మాటలు గమనిస్తే ఆయన పరోక్షంగా చరణ్ పాత్ర కీలకం, కష్టతరం అని చెప్పేశాడు. ఒక ప్రక్క ఎన్టీఆర్ కి సప్పోర్ట్ చేస్తూనే ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ పాత్రే కీలకమని హింట్ ఇచ్చాడు.
RRR Movie
ఇక ఆర్ ఆర్ ఆ కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు. భీమ్ పాత్రతో పోల్చితే రామ్ పాత్రలో కాంప్లెక్సిటీ ఎక్కువ. చేయడానికి కష్టంతో కూడుకున్న పాత్ర అని తెలియజేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కి అద్భుతమైన సన్నివేశాలు, పాత్ర ఉన్నప్పటికీ చరణ్ ని ప్రత్యేకంగా ఎలివేట్ చేశారనేది నిజం.