నయనతార, తమన్నాకి చెక్ పెట్టేసిన హీరోయిన్.. చైతు రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సంచలనం, టాప్ 10 లిస్ట్ ఇదే
ఐఎండిబి సంస్థ మోస్ట్ 2023 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీస్ జాబితా విడుదల చేసింది. టాప్ 10 లిస్ట్ లో కొంతమంది ఊహించిన సెలెబ్రిటీలే ఉండగా మరికొంతమంది ఊహించని తారలు చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ పై విరుచుకుపడ్డారు. ఈ రెండు చిత్రాలకు గాను షారుఖ్ కి మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీల జాబితాలో అగ్ర స్థానం దక్కింది.
రెండవ స్థానంలో అలియా భట్ నిలిచింది. అలియా భట్ ఈ ఏడాది అంతగా సౌండ్ చేయలేదు. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాల్లో నటించిన అలియాకి సెకండ్ ప్లేస్ దక్కింది.
ఇక మూడవ స్థానాన్ని బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె కైవసం చేసుకుంది. దీపికాకి ఉన్న క్రేజ్ కి 3 వ స్థానం దక్కడంతో ఆశ్చర్యం లేదు.
సర్ప్రైజింగ్ గా నాల్గవ స్థానంలో యంగ్ సెన్సేషన్ వామిక గబ్బి నిలిచింది. ప్రస్తుతం వామిక పేరు బాలీవుడ్ అంతటా వినిపిస్తోంది. కూఫియా చిత్రంలో ఆమె నటించిన శృంగార భరిత సన్నివేశంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమన్నా, నయనతార లాంటి సెలబ్రిటీలని అధికమిస్తూ వామికా ఈ ఘనత సాధించడం విశేషం.
నయనతార ఐదవ స్థానంలో సరిపెట్టుకుంది. నయనతార చివరగా జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె సోలో హీరోయిన్ గా పలు చిత్రాలు చేస్తోంది.
ఆరవ స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నిలిచింది. జీ కార్ద, లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లలో తమన్నా శృంగార సన్నివేశాలు సోషల్ మీడియా మొత్తం సంచలనం సృష్టించాయి. జైలర్ చిత్రంలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు చిన్న పాత్రలో మెరిసింది.
కరీనా కపూర్ 7వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది కరీనా అంతగా హంగామా చేయలేదు. మరి ఆమెకి టాప్ 10 లో చోటు దక్కడం ఆశ్చర్యమే.
ఇక 8వ స్థానం వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ దక్కించుకుంది. ఇది తెలుగు బ్యూటీకి దక్కిన గౌరవమే అని చెప్పొచ్చు. ఈ ఏడాది శోభిత పొన్నియన్ సెల్వన్ 2, నైట్ మేనేజర్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఆమె పేరుబాగా వైరల్ అవుతోంది.
9వ స్థానంలో ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు. సెల్ఫీ, ఓమైగాడ్ 2, మిషన్ రాణిగంజ్ చిత్రాలు అక్షయ్ కుమార్ నుంచి వచ్చాయి.
10 వ స్థానం మరో సౌత్ నటుడికి దక్కింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఆ ప్లేస్ ని కైవసం చేసుకున్నారు. నెగిటివ్ రోల్స్ లో విజయ్ సేతుపతి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.