MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆసుపత్రి బెడ్ పై ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా.. ఏం జరిగింది..

ఆసుపత్రి బెడ్ పై ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా.. ఏం జరిగింది..

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 30 2023, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

26

అయితే ప్రస్తుతం ఈ నడుము సుందరి అరకొర చిత్రాలు చేస్తూ.. ఫ్రెండ్స్ తో ఫారెన్ ట్రిప్పులో బిజీగా ఉంటోంది. ఫారెన్ వెకేషన్స్ లో హుషారుగా ఉండే ఇలియానా తాజాగా అస్వస్థతకి గురైంది. తాను ఆసుపత్రి పాలైన విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

36

ఇలియానా అనారోగ్యానికి గల కారణాలు చెప్పలేదు కానీ.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకి మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కించారట. ఇంతలా ఇలియానా అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 

46

బహుశా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో తాను ప్రస్తుతం కోలుకున్నానని ఇలియానా మరో పోస్ట్ లో పేర్కొంది. అంతా ఒక్కరోజులో జరిగిపోయిందని ఇలియానా పేర్కొంది. 

56

తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఏది ఏమైనా ఇలియానా ఆసుపత్రి పాల కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది.

66

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved