ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా.. మహేష్ బాబు బ్యూటీ ఎమోషనల్
Ileana: టాలీవుడ్ బ్యూటీ ఇలియానా రెండోసారి తల్లి అయ్యింది. ఆ సమయంలో తాను ఎదురైన ఇబ్బందులను తన ఫ్యాన్స్ కు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రెగ్నెన్సీ సమయంలో తాను మానసికంగా గందరగోళం, ఒంటరితనంగా ఫీల్ అయ్యాయని తెలిపారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్
Ileana: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన ఇలియానా (Ileana) మళ్లీ వార్తల్లో నిలిచింది. 2006లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తరువాత మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి చిత్రంతో ఒక్కసారిగా టాప్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఇలియానా, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.
సీక్రెట్ మ్యారేజ్
ఇలియానా హిందీ సినిమాల వైపు దృష్టి సారించింది. అమెరికా నటుడు మైఖేల్ డోలన్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. 2023లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఈ ఏడాది జూలైలో రెండో బిడ్డకు తల్లి అయ్యింది. ఈ సంతోషకర సందర్భంలోనూ ఇలియానా తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
ప్రసవ సమయ కష్టాలు
ఇలియానా మాట్లాడుతూ, ‘‘మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఒంటరిగా ఉన్నప్పటికీ బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకున్నాను. కానీ రెండోసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇక కేవలం బిడ్డనే కాదు, నాతో పాటు మరో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత నాదే. ఆ సమయంలో శారీరకంగా బలాన్ని తిరిగి పొందడమే కాదు.. మానసికంగా కూడా గందరగోళంగా అనిపించింది. నిజంగా ఇది చాలా కష్టతరమైన అనుభవం’’ అని పేర్కొంది.
బాగా మిస్సవుతున్నా
అలాగే ముంబైని బాగా మిస్సయ్యానని చెప్పిన ఇలియానా, ‘‘అక్కడ ఉంటే నా ఫ్రెండ్స్ సాయం చేసేవారు. కానీ ఇక్కడ ఒంటరిగా పిల్లల బాధ్యతలు చూసుకోవడం చాలా కష్టమైంది’’ అని తెలిపింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇలియానా తిరిగి రీఎంట్రీ ఇస్తుందా అనే ప్రశ్న అనుమానం అభిమానులను వేధిస్తోంది. గతంలో తెలుగు, హిందీ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్న ఈ గోవా బ్యూటీ మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే ఆసక్తి పెరిగింది.