MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్రశాంత్‌ నీల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్ అయితే ప్రభాస్‌దే విజయం.. కానీ అవతల ఉన్నది రాజ్‌కుమార్‌ హిరానీ

ప్రశాంత్‌ నీల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్ అయితే ప్రభాస్‌దే విజయం.. కానీ అవతల ఉన్నది రాజ్‌కుమార్‌ హిరానీ

ప్రభాస్‌ ప్రస్తుతం `సలార్‌` చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమా షారూఖ్‌ నటిస్తున్న `డుంకీ` మూవీతో పోటీ పడుతుంది. కానీ ప్రశాంత్‌ నీల్‌ సెంటిమెంట్‌ ఇప్పుడు ప్రభాస్‌ కి పాజిటివ్‌గా సిగ్నల్స్ ఇస్తున్నాయి.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 30 2023, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇండియన్‌ సినిమాలో ఓ బిగ్గెస్ట్ ఫైట్‌ చోటు చేసుకోబోతుంది. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నారు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌, మరో పాన్‌ ఇండియా స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. డార్లింగ్‌ నటించిన `సలార్‌`, కింగ్‌ ఖాన్‌ చేసిన `డుంకీ` చిత్రం డిసెంబర్‌ 22నే విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలు ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండు భారీ స్థాయిలో బలమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాలు కావడంతో ఈ సారి పోటీ ఊహించని విధంగా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఇక్కడ ప్రశాంత్‌ నీల్‌ సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు క్రిటిక్స్. గతంలో ఆయన సినిమాల హిస్టరీ చూస్తే ప్రభాస్‌ సినిమాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో గత హిస్టరీని తోడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రశాంత్‌ నీల `కేజీఎఫ్‌` చిత్రాలతో వచ్చారు. మొదట `కేజీఎఫ్‌` చిత్రం 2018లో డిసెంబర్‌ 21న విడుదలైంది. అదే రోజు షారూఖ్‌ ఖాన్‌ నటించిన `జీరో` చిత్రం వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బోల్తా కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన `కేజీఎఫ్‌` సంచలనం సృష్టించింది. కన్నడ చిత్ర పరిశ్రమ పవర్‌ ఏంటో ఇండియన్ సినిమాకి చూపించింది. 

37

ఆ తర్వాత మరోసారి స్టార్‌ హీరోతో పోటీ పడ్డారు ప్రశాంత్‌ నీల్‌. గతేడాది `కేజీఎఫ్‌2`తో వచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదలైంది. `కేజీఎఫ్‌` పెద్ద హిట్‌ కావడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించి సినిమా ఉండటంతో ఈ చిత్రం ఏకంగా 1200కోట్లు వసూలు చేసింది. అయితే దీనికి ఒక్క రోజు ముందు దళపతి విజయ్‌ నటించిన `బీస్ట్` చిత్రం విడుదలైంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. డిజాస్టర్‌గా మారింది. 
 

47

దీంతో ఇప్పుడు మూడోసారి అదే సెంటిమెంట్‌ని ప్రశాంత్‌ నీల్‌ రిపీట్‌ చేస్తాడా? హ్యాట్రిక్‌ హిట్‌ కొడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన ప్రభాస్‌ హీరోగా రూపొందిస్తున్న `సలార్‌` చిత్రం డిసెంబర్‌ 22న విడుదల చేయబోతున్నారు. అదే రోజు షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న `డుంకీ` చిత్రం రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు షారూఖ్. `పఠాన్‌`, `జవాన్‌`లతో రెండు వెయ్యి కోట్ల చిత్రాలను చేసి ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. దీంతో `డుంకీ`పై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రశాంత్‌ నీల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే షారూఖ్‌ మీద ప్రభాస్‌దే విజయం అంటున్నారు క్రిటిక్స్. మరి అది సక్సెస్‌ అవుతుందా? లేదా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

57

అయితే షారూఖ్‌ చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని రూపొందించినది ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ. ఆయన హిస్టరీ చూస్తే మైండ్‌ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇరవై ఏళ్లల్లో ఆయన ఇప్పటి వరకు ఐదు సినిమాలే చేశారు. ఇప్పుడు `డుంకీ`తో ఆరో సినిమాతో రాబోతున్నారు. ఇప్పటి వరకు రాజ్‌కుమార్‌ హిరానీ చేసిన ఏ సినిమా ఫ్లాప్‌ కాలేదు. `మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌`, `లగ్‌ రహే హో మున్నాభాయ్‌`, `3ఇడియట్స్`, `పీకే`, `సంజు` ఇవన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. సంజయ్‌ దత్‌ బయోపిక్‌ `సంజు`నే ఎబౌ యావరేజ్‌గా నిలిచింది. అది బయోపిక్‌ కావడంతో రాజ్‌కుమార్‌ హిరానీ మీద దాన్ని తోయలేం. 
 

67

రాజ్‌ కుమార్‌ హిరానీ రూపొందించిన చిత్రాలన్నీ సోషల్‌ సెటైరికల్‌గా ఉంటాయి. కాంటెంపరరీగానూ ఉంటాయి. వినోదం, సెటైర్లు, సామాజిక సందేశం మేళవింపుతో ఉంటాయి. ఆలోచంప చేసేలా ఉంటాయి. పైగా ఇవన్నీ బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్. ఆయా సినిమా రిలీజ్‌ టైమ్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాలు. దీనికితోడు రాజ్‌కుమార్‌ హిరానీ మూడు నాలుగేళ్లకి ఒక్కో సినిమా చేస్తారు. అంటే ఆయన ఎంత ఆచితూచి చేస్తారో, ఎంత జాగ్రత్తగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఓటమి ఎరుగని దర్శకుడు కావడంతో ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది.

77

 ఈ సారి కూడా రాజ్‌కుమార్‌ హిరానీ తప్పడు అని, బాక్సాఫీసు వద్ద ప్రభాస్‌ `సలార్‌`కి `డుంకీ`కి మధ్య గట్టి పోటీ తప్పదని, ఇది ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్ ఫైట్‌గా ఉండబోతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫైట్‌ చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఆసక్తికరంగా వెయిట్‌ చేస్తుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved