- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ అయితే బెస్ట్ ఆప్షన్.. రామ్‌చరణ్ కాదంటే ఆయనతోనే.. మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అయితే బెస్ట్ ఆప్షన్.. రామ్‌చరణ్ కాదంటే ఆయనతోనే.. మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఆచార్య’. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను పెంచాయి.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వం వహించడం, మెగా తండ్రీకొడుకులు నటించడంతో అభిమానులు సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను షురూ చేసిన చిత్ర యూనిట్ నిన్న Acharya ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
మరో మూడురోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని మరింత ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆచార్య చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అసలు ఆచార్య సినిమాను తన సినిమాగానే రూపుదిద్దుకుందన్నారు.
ఈ సినిమాలో చరణ్ లేకపోతే, చెర్నీ డేట్స్ దొకరకపోతే కచ్చితంగా అల్టర్ నేట్ గా పవన్ కళ్యాణ్ ను తీసుకునే వాళ్లం. ఎందుకంటే చరణ్ ఇచ్చే ఫీల్ ను, ఇతర యాక్టర్స్ నుంచి రావడం కష్టం. అందుకని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని సబ్ స్టిట్యూట్ చేసేవారని చెప్పుకొచ్చారు. నిజానికి రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ప్రారంభమైనప్పడు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆచార్య మూవీని కూడా దర్శకుడు కొరటాల శివ కేవలం చిరంజీవి సినిమాగానే భావించాడు.
కానీ ఆ తర్వాత జరిగిన మేజిక్ తో చరణ్ కూడా నటించాడు. దీంతో తండ్రీ కొడుకుల కాంబినేషన్ తో మాస్ విజువల్స్ బాగా వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంటోంది. ఇప్పటకే రిలీజ్ అయినా సాంగ్స్, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మరింత హైప్ పెంచాయి.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. చిరు, చరణ్ కు జోడీగా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే (Pooja Hegde)లు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆచార్యకు మంచి మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.