MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యను నేను పెంచలేదు, తను అఖిల్ లాంటి కుర్రాడు కాదు... స్టెప్ సన్ మీద అమలకు ఉన్న అభిప్రాయం ఇదా!

నాగ చైతన్యను నేను పెంచలేదు, తను అఖిల్ లాంటి కుర్రాడు కాదు... స్టెప్ సన్ మీద అమలకు ఉన్న అభిప్రాయం ఇదా!

నాగార్జున మొదటి భార్య సంతానం నాగ చైతన్య. అఖిల్-నాగ చైతన్య తల్లులు వేరు. కాగా అఖిల్ తల్లి అమలతో నాగ చైతన్యకు ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలియదు. ఓ సందర్భంలో అమల తన స్టెప్ సన్ నాగ చైతన్యను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేసింది..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2024, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


కింగ్ నాగార్జునకు రెండు వివాహాలు. మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఏడడుగులు వేశారు. వీరి సంతానం నాగ చైతన్య. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. కాగా 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో వివాహం చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


దగ్గుబాటి లక్ష్మి సైతం రెండో వివాహం చేసుకుని చెన్నై లో సెటిల్ అయ్యింది. నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు నాన్న నాగార్జున వద్దకు వస్తూ ఉండేవాడట. పెద్దయ్యాక నాగచైతన్యను నాగార్జునే హీరోగా లాంచ్ చేశాడు. అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయం చేశాడు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ చిత్రం 2009లో విడుదలైంది. 

37

ఇక రెండో భార్య అమల సంతానమే అఖిల్. ఆయన కూడా హీరోగా 2015లో అరంగేట్రం చేశాడు. సవతి తల్లి అమలతో అఖిల్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసింది తక్కువే. ఎందుకంటే అమల-నాగ చైతన్య పెద్దగా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన స్పెషల్ ఈవెంట్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు.

47


గతంలో ఓ ఇంటర్వ్యూలో అమల స్టెప్ సన్ నాగ చైతన్యని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల మాట్లాడుతూ... నాగ చైతన్య నా వద్ద పెరగలేదు. చెన్నైలో వాళ్ళ అమ్మ వద్దే ఉండేవాడు. అప్పుడప్పుడు ఇక్కడికి(హైదరాబాద్) వచ్చేవాడు. నాన్నతోనే ఎక్కువ గడిపేవాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. 
 

57
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

అఖిల్-నాగ చైతన్య మధ్య మంచి బాండింగ్ ఉండేది. అఖిల్ కి చైతన్య ఓ మంచి అన్నయ్య. ఇక్కడికి వస్తే చైతూ వెనకాలే అఖిల్ తిరిగేవాడు. చైతు ఎప్పుడు వస్తాడా అని అఖిల్ బాల్యంలో ఎదురు చూసేవాడు. నాగ చైతన్య నాటీ కాదు. అఖిల్ మాత్రం హైపర్ యాక్టీవ్. 
 

67


వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే నాకు గుండెల్లో దడ మొదలవుతుంది. నాగార్జున మాదిరే చిత్ర ఫలితం నుండి ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు... అని అమల వెల్లడించారు. ఆమె మాటలను బట్టి చూస్తే... చైతూకి అమలతో బలమైన అనుబంధం లేకపోయినా... అఖిల్ తో ఉందని తెలుస్తుంది. 

77

నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. వరుస పరాజయాలలో ఉన్న నాగ చైతన్య తండేల్ తో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాడు. అటు అఖిల్ పరిస్థితి కూడా అలానే ఉంది. అక్కినేని బ్రదర్స్ కి 2024 ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved