MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇప్పటికే ఇరవై పెళ్లిళ్లు అయ్యాయి.. `చిన్నారి పెళ్లికూతురు` అవికా గోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పటికే ఇరవై పెళ్లిళ్లు అయ్యాయి.. `చిన్నారి పెళ్లికూతురు` అవికా గోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

హీరోయిన్‌గా సినిమా ఆఫర్లు తగ్గాయి. ఒకటి అర మెరుస్తుంది. కానీ విజయాలు లేకపోవడంతో అవికాని పట్టించుకోవడం లేదు. దీంతో  ఇప్పుడు ఓటీటీలకు పరిమితమవుతుంది అవికాగోర్‌. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 01 2023, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`చిన్నారి పెళ్లి కూతురు` సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది అవికా గోర్‌. ఈ సీరియల్ ఆమెకి విదేశాల్లోనూ అభిమానులను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అదే క్రేజ్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. `ఉయ్యాల జంపాల` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా తొలి తెలుగు సినిమాతోనే హిట్‌ అందుకుంది. పాపులర్ అయ్యింది. వరుసగా పలు విజయవంతమైన సినిమాలు చేసింది. కానీ ఆ మధ్య వచ్చిన బ్రేక్‌ ఆమెని బాగా ఇబ్బంది పెడుతుంది. కెరీర్‌ పరంగా నిలదొక్కుకోలేకపోతుంది. 
 

26

హీరోయిన్‌గా సినిమా ఆఫర్లు తగ్గాయి. ఒకటి అర మెరుస్తుంది. కానీ విజయాలు లేకపోవడంతో అవికాని పట్టించుకోవడం లేదు. దీంతో తనే నిర్మాతగా మారి `పాప్‌ కార్న్` మూవీ చేసింది. ఇది ఆడలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలకు పరిమితమవుతుంది అవికాగోర్‌. ఆమె వెబ్‌ సిరీస్‌లతో ఫుల్‌ బిజీగా ఉంది. డిజిటల్‌ని బాగా వాడుకుంటుంది. ఓటీటీలో బిజీ అవుతుంది. మొన్న `మాన్షన్‌ 24`లో మెరిసింది అలరించింది. ఇప్పుడు `వధువు` అనే వెబ్‌ సిరీస్‌తో రాబోతుంది. 

36

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంది అవికా గోర్‌. ఇందులో తన పెళ్లి మ్యాటర్స్ వెల్లడించింది. తనకు ఇప్పటికే ఇరవై సార్లు మ్యారేజ్‌ అయ్యిందంటూ కామెంట్‌ చేసింది. `చిన్నారి పెళ్లి కూతురు` అనేది పెళ్లి కాన్సెప్ట్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు,సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు ఇలా అన్ని కలిపి తనకు ఇరవై సార్లు పెళ్లి అయిపోయిందని తెలిపింది. దీంతో అదే ఇందులో కూడా ఉందని, దీంతో తనకు పెళ్లి కూతురుగా చేయడం ఈజీ అయ్యిందని చెప్పింది అవికా గోర్‌. 
 

46

``చిన్నారి పెళ్లి కూతురు` సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు. అప్పటికి పెళ్లంటే ఎంటే, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఏమాత్రం  అవగాహన లేదు.  ఇప్పుడు  "వధువు" వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇబ్బంది లేదు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు.  ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్ పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు నుంచి  "వధువు" దాకా ఎన్నో సందర్భాల్లో నా ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగింది. నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్ కు టైమ్ కోల్పోయినా.. నటిగా  ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నా, ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా. `వధువు`లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లీ సీన్ చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లి కూతురు అయ్యా అనిపించింది` అని చెప్పింది. 
 

56

``వధువు` వెబ్ సిరీస్ లో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా అని అందరూ అడుగుతున్నారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లర్ జానర్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మీరు ట్రైలర్ లో చూసినట్లు మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. టీవీలో సీరియల్స్ చేసిన అనుభవం నాకు ఉంది. టీవీ ఆడియెన్స్ కు ఎలాంటి కంటెంట్ ఇష్టమో..అది  `వధువు`లో ఉంటుంది. ఇప్పటిదాకా ఓటీటీ చూడకుండా టీవీ కంటెంట్ ఇష్టపడేవారు  `వధువు` కోసం ఓటీటీకి వస్తారనే నమ్మకం ఉంది. ఆ సెక్షన్ ఆడియెన్స్ ను   ఆకర్షించబోతున్నాం. `వధువు` వెబ్ సిరీస్ లో ఇందూ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఆమెకు తనదైన ఒక స్టోరి ఉంటుంది. తన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఇందు మనసులో మెదులుతూ ఉంటాయి. ఒక సాధారణ పెళ్లి కూతురుగా ఆమె ఉండదు` అని చెప్పింది అవికా గోర్‌. 
 

66

`ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ నా కెరీర్ మీద ఉంది. ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. ఇటీవల `పాప్ కార్న్` అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా మారాను. ఆ సినిమా నా కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది. నా దగ్గరకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మంచి లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తాను. నటిగా నాకు ఒకే జానర్ లో కంటిన్యూ కావాలని లేదు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నానని చెప్పింది అవికా.  ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి "వధువు" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved