MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్కరు కాదు వంద మంది సాయిపల్లవిలు కనిపించారంటూ.. `లవ్‌ స్టోరి`ని టాలీవుడ్‌ క్లాసిక్‌గా వర్ణించిన నాగార్జున..

ఒక్కరు కాదు వంద మంది సాయిపల్లవిలు కనిపించారంటూ.. `లవ్‌ స్టోరి`ని టాలీవుడ్‌ క్లాసిక్‌గా వర్ణించిన నాగార్జున..

కింగ్‌ నాగార్జున(nagarjuna) `లవ్‌ స్టోరి`(lovestory) సినిమాపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో హీరోయిన్‌ సాయిపల్లవిపై ప్రశంసల వర్షం కురిపించారు. వంద సాయిపల్లవిలు కనిపించారన్నారు. చైతూని చూస్తే కడుపు నిండిందన్నారు.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 28 2021, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌ స్టోరి` చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకుడు. సునీల్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. మంచి కలెక్షన్లని రాబట్టుకుంటుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో `లవ్‌ స్టోరి` మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నాగార్జున `లవ్ స్టోరి` సక్సెస్ గురించి మాట్లాడుతూ, `లవ్ స్టోరి` ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు. లవ్ స్టోరి ఒక నాంది. దసరా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చింది. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్ స్టోరి విజయం వల్ల సంబరాలు చేసుకున్నారు.

37

దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. ఆయన పేరు పేరునా టీమ్ అందరినీ పిలిచారు. మేము మర్చిపోతాం. నీ మానవత్వం సూపర్బ్. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ అది సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేసి తీయాలి. శేకర్ కమ్ముల అది నేర్చుకున్నాడు. లవ్ స్టోరి ఊరికే హిట్ అవలేదు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. 

47

ఒక అమ్మాయి ముందుకొచ్చి తన సమస్యను చెప్పగలిగితే చాలు లవ్ స్టోరి కి సార్థకత వచ్చినట్లే. సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో ఏవేవో వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని నిరూపించారు శేఖర్ కమ్ముల. క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్ట్ చేస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశారు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు. కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్. నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయాను. 

57

 సాయి పల్లవి గురించి చెబుతూ..`మీ తాతగారికి `అన్నమయ్య` సినిమానే చూపిస్తూ ఉండు. సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. నువ్వు(సాయిపల్లవి) ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్. `లవ్ స్టోరి` ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అప్పుడప్పుడూ వస్తుంటాయి. 
 

67

నాగచైతన్య గురించి చెబుతూ, చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా... నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్. 

77

`ప్రేమనగర్` రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించింది. తెలుగు  ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం మాస్క్ లు తీసేసి హాయిగా కలిసి ఉండాలని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా` అని నాగార్జున చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత నారాయణ దాస్‌నారంగ్‌ని తన నాన్నతో పోల్చుకున్నారు. ఆయన్ని చూస్తుంటే నాన్నగారి చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అందుకే బ్లెస్సింగ్స్ తీసుకుంటానని తెలిపారు. తనతో సినిమా తీయకుండా చైతూతో సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాన్నను చూసినట్లే ఉంటుంది` అని తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Recommended image3
Tejaswini Nandamuri: అరాచకం అంతే.. బాలయ్య చిన్న కూతురు ఊరమాస్ డాన్స్.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved