MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలు పోకిరి ఎందుకు ఆడిందో నాకే తెలియదు, మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పై పూరి జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ 

అసలు పోకిరి ఎందుకు ఆడిందో నాకే తెలియదు, మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పై పూరి జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ 

దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ పోకిరి. ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆ చిత్రం పై పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 05 2024, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu

Mahesh Babu


2006లో విడుదలైన పోకిరి ఒక సంచలనం. పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఫస్ట్ చిత్రం పోకిరి. దర్శకుడు పూరి జగన్నాధ్ తన హీరోల క్యారెక్టరైజేషన్ చాలా రఫ్ అండ్ టఫ్ గా తీర్చిదిద్దుతాడు. రాముడు మంచి బాలుడు అనే సిద్ధాంతం పూరి జగన్నాధ్ బ్రేక్ చేశాడని చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ తో హీరో పాత్రలను రూపొందిస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Mahesh Babu

Mahesh Babu


గతంలో ఎన్నడూ చూపించని విధంగా పోకిరి లో మహేష్ ని ప్రజెంట్ చేశాడు. మహేష్ బాబుకు జంటగా ఇలియానాను తీసుకున్నారు. అప్పటికి ఇలియానా దేవదాసు చిత్రం చేసి ఉంది. పెద్దగా ఫేమ్ లేని ఆమెకు మహేష్ బాబు పక్కన ఛాన్స్ దక్కింది. ప్రకాష్ రాజ్ ప్రధాన విలన్. నాజర్, బ్రహ్మానందం, అలీ, అజయ్, సుధ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే ఇతర కీలక రోల్స్ చేశాడు. 

పోకిరి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 2006 ఏప్రిల్ 27న సమ్మర్ కానుకగా విడుదల చేశారు. ఫస్ట్ డే మూవీకి మిక్స్స్ టాక్. మెల్లగా మూవీ పుంజుకుంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. టాలీవుడ్ రికార్డ్స్ పోకిరి బ్రేక్ చేసింది. పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్... ఎవర్ గ్రీన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.. వంటి డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. 
 

35
Mahesh Babu

Mahesh Babu


ఇలియానా గ్లామర్, మణిశర్మ సాంగ్స్, బ్రహ్మానందం-అలీ కామెడీ ట్రాక్స్ ఫుల్ గా ఎంటర్టైన్ చేశాయి. మహేష్ బాబు ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం పోకిరి అనడంలో సందేహం లేదు. కాగా పోకిరి అనంతరం ఆ రేంజ్ మూవీ పూరి జగన్నాథ్ నుండి రాలేదు. కాగా పోకిరి ఎలా హిట్ అయ్యిందో నాకే తెలియదు అని ఓ సందర్భంలో పూరి జగన్నాధ్ సంచలనం రేపింది. 

ఓ ఇంటర్వ్యూలో... అసలు పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని మీరు భావించారా? అని పూరి జగన్నాధ్ ని అడగ్గా... లేదు. నేను కానీ, మహేష్ బాబు కానీ పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. మంచి సినిమా అవుతుంది. ఆడుతుంది అనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే, నా దగ్గర ఉన్న కథల్లో అది కూడా ఒకటి, అని పూరి జగన్నాథ్ అన్నారు. 
 

45

ఒక దర్శకుడిగా, పోకిరి అంత పెద్ద విజయం సాధించడానికి కారణం చెప్పండి, అని యాంకర్ అడిగారు. పోకిరి తర్వాత ఆ రేంజ్ మూవీ నా నుండి రాలేదని విమర్శలు ఉన్నాయి దాంతో మూడేళ్ళ తర్వాత అసలు నేను ఏం తీశానా? అని ప్రసాద్ ల్యాబ్స్ లో పోకిరి మూవీ వేసుకుని చూశాను. నాకేమి అర్థం కాలేదు. సినిమా గురించి ఎవరికీ తెలియదు. ఏ సినిమా నచ్చుతుందో, ఏ సినిమా నచ్చదో చెప్పలేము. పోకిరి ఎందుకు ఆడిందో నాకు కూడా తెలియదు, అన్నారు. 

పూరి జగన్నాథ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పోకిరి అనంతరం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు, చిరుత సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మహేష్ బాబు తో బిజినెస్ మేన్ టైటిల్ తో మూవీ చేసి మరో హిట్ కొట్టాడు. అయితే పోకిరి రేంజ్ హిట్ ఆయనకు మరలా పడలేదు. 
 

55
Puri Jagannadh

Puri Jagannadh

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి ప్రస్తుతం పూరి జగన్నాథ్ ప్లాప్స్ లో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయనకు మరలా పరాజయాలు ఎదురయ్యాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ రూపంలో మరో రెండు ప్లాప్స్ పడ్డాయి. చెప్పాలంటే పూరి జగన్నాధ్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. 

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్... ఇలా ప్రతి ఒక్కరితో ఆయన సినిమాలు చేశారు. కాగా పూరి జగన్నాథ్ కొత్త మూవీ ప్రకటన చేయాల్సి ఉంది. ఆయన ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved