- Home
- Entertainment
- మెగాస్టార్ స్థానం రామ్ చరణ్ దే.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు.. తాను పెద్ద అభిమానిని అంటూ స్టేట్‌మెంట్
మెగాస్టార్ స్థానం రామ్ చరణ్ దే.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు.. తాను పెద్ద అభిమానిని అంటూ స్టేట్‌మెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఏదో గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ అల్లు అర్జున్ కామెంట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి నీడలో పెరిగారు. హీరోగా ఎదిగారు. తనది చిరంజీవి కంటే ముందే సినిమా ఫ్యామిలీ. తాత అల్లు రామలింగయ్య నటుడిగా మెప్పించారు. నిర్మాతగా రాణించారు. కానీ బన్నీ హీరోగా ఎదిగేందుకు చిరంజీవి సపోర్ట్ తీసుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ తో సహా అంతా ఆయన బాటలో నడిచి ఎదిగిన వారే. అందులో బన్నీ కూడా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది వాళ్లే చెప్పే మాట.
Mega heroes
ఇదిలా ఉంటే నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ మేరకు ఆయనకు సంబంధించిన ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే తాజాగా ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. రామ్ చరణ్ గురించి బన్నీ మాట్లాడిన వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి. `పుష్ప`తో పాన్ ఇండియా స్టార్‌గా రాబోతున్న ఆయన చరణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Allu Arjun Ram Charan
ఇంతకి బన్నీ ఏం మాట్లాడాడంటే.. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్.. రామ్ చరణ్ గురించి చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ అంటే తనకు ప్రాణం అని, నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నెంబర్ 1గా చూడాలనుకున్న నా హీరో. నా కోరిక అది. ఒక హీరోగా చెబుతున్నా, నేను చరణ్ అభిమానిని. చరణ్ అంటే నాకు పిచ్చి. మెగాస్టార్ తర్వాత చరణ్‌నే ఆస్థానంలో చూడాలనేది ఒక ఆశ.
Ram Charan - Allu Arjun
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్‌ని ఆల్‌రెడీ చూసేశారు. ఆయన చూడ్డానికి ఏం లేదు. ఆయన చూడని రేంజా, ఆ రేంజ్‌కి చరణ్ వెళ్తున్నాడు. ఆ స్థానం ఆయనదే. మెగాస్టార్ చిరంజీవి స్థానంలో రామ్ చరణ్‌ని చూడాలనుకుంటున్నా. పాతికేళ్లు ఆ పొజిషీయన్ తనదే అవ్వాలని కోరుకుంటున్నా` అని తెలిపారు అల్లు అర్జున్. ఈ వ్యాఖ్యలు వైరల్‌తోపాటు, వీడియో హల్‌చల్ చేస్తుంది. అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల షాక్ అవుతున్నారు.
ఇది చాలా ఓల్డ్ వీడియో. ఓ సినిమా ఫంక్షన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తుంది. కానీ బన్నీ బర్త్ డే సందర్భంగా చక్కర్లు కొట్టడం విశేషం. ఈ వీడియోపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతారు, కానీ బన్నీ ఫ్యాన్స్ రియాక్షనే ఆశ్చర్యంగా మారింది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప2` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ కాసేపట్లో విడుదల కాబోతుంది. దీనికోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిటింగ్.