బ్రహ్మానందం ఫోన్ చేస్తే ..అయితే ఏంటి?,రెండు సార్లు మోసపోయా

First Published 28, Oct 2020, 2:54 PM

'జబర్ధస్త్'  ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి జబర్ధస్త్ షోని చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపించే హైపర్ ఆది సినిమాల్లో సైతం నటించారు. అయితే అవి పెద్దగా క్లిక్ కాలేదు. ఇక హైపర్ ఆదికు హైపర్ అనే పేరు ఎవరు తగిలించారో తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయం. అలాగే ఆయన పర్శనల్ లైఫ్, మోసపోయిన సంగతులు , జబర్ధస్త్ కామెడీ షో నుంచి సినిమాల్లోకి ప్రమోషన్ పొందడం వెనక ఉన్న కృషిని ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో పంచుకున్నాడు. ఆ విశేషాలు చూద్దామా

హైపర్‌ ఆది మాట్లాడుతూ..కోట ఆదయ్య మా తాత పేరు. అదే నాకు పెట్టారు. స్కూల్‌, కాలేజ్‌లో ఆ పేరుతో బాగా ఆటపట్టించేవారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆదిగా పేరు మారింది. ‘హైపర్‌’ అనే టైటిల్‌ ‘జబర్దస్త్‌’ చేసేటప్పుడు మా దర్శకులు పెట్టారు. నేను చేసే స్కిట్లలో ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువగా ఉండేది దాంతో ‘హైపర్‌’ అని పెట్టారు. (Pic Courtesy: etv Jabardasth)

ఇండస్ట్రీ టాప్ కమెడియన్‌  ఆదికు ఫోన్‌ చేసిన విషయం గురించి చెప్తూ..

ఒక రోజు సడెన్‌గా కాల్‌ వచ్చింది. ఫ్రెండ్స్‌ ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నా. ‘హలో నేను బ్రహ్మానందం’ అని అవతలి నుంచి మాట్లాడుతున్నారు. ‘నేను హైపర్‌ ఆది’ అయితే ఏంటి? అన్నాను. ‘నేను నిజంగా బ్రహ్మానందం మాట్లాడుతున్నా’ అన్నారు అవతలి వ్యక్తి. కొద్దిసేపటికి నాకు అసలు విషయం అర్థమైంది. ‘సారీ సర్‌.. ఎవరో ఆట పట్టిస్తున్నారనుకున్నా’ అని ఆయనతో మాట్లాడా. ఆ తర్వాత వెళ్లి కలిసి సారీ చెప్పా అన్నారు ఆది.

(Pic Credit: ETV Dhee)

సినిమాల్లో క్లిక్ అవ్వకపోవటం గురించి చెప్తూ..

బుల్లితెరపై  నా పంచ్‌లు బాగా ఆకట్టుకుంటాయి .స్క్రిప్ట్‌లో ఎక్కువగా నేనే మాట్లాడుతుంటా. పంచ్‌లు వేసేది కూడా నేనే. సినిమా  లెంగ్త్ ఎక్కువ కాబట్టి, రెండు మూడు సీన్లు ఉంటాయంతే. ‘తొలిప్రేమ’, ‘మేడ మీద అబ్బాయి’ చిత్రాల్లో ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్లు చేశా. డైరెక్టర్‌ పాయింట్ ఆఫ్‌ వ్యూలో మన క్యారెక్టర్లు వర్కవుట్‌ అవుతాయి అన్నారు ఆది.

ఇండస్ట్రీకి  రాకముందు ..?

కాలేజ్‌లో ఉండగా, మిమిక్రీ చేసేవాడిని, పాటలు పాడేవాడిని. ఇండస్ట్రీలోకి రావాలని ఉండేది. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తూ, శని, ఆదివారాల్లో షూటింగ్‌లు జరిగే చోటుకు వెళ్లేవాడిని. ‘జబర్దస్త్‌’ కంటే ముందు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌లో రచయితగా చేశాను. ఒక సీరియల్‌కు స్క్రిప్ట్‌ రాశాను. ‘తడఖా’ మిమిక్రీ షోకు కూడా రాశాను. ఆ తర్వాత ‘జబర్దస్త్‌’ అభి అన్న పరిచయమవడం, మంచి వేషాలు వేయడంతో జాబ్‌ వదిలేశా అన్నారు హైపర్‌ ఆది.

వర్షిణితో తగువు గురించి చెప్తూ..

మేము ఆస్ట్రేలియా వెళ్లాం. మొదటి నుంచి మాకు పరిచయం లేదు. మమ్మల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లిన వాళ్లందరితో కలిసి కూర్చొన్నాం. తను ఏదో సెటైరికల్‌గా మాట్లాడుతోంది. నేను మాట్లాడదామని లేచి ఏదో చెప్పబోతుంటే.. అందరి మధ్యలో ‘నువ్వు ఆపు’ అన్నది. నాకు విపరీతమైన కోపం వచ్చింది. చేతిలో ఉన్న కోక్‌ బాటిల్‌ను నేలకేసి కొట్టి వర్షిణిపై అరిచేశాను. అందరూ షాకయ్యారు. ఆ తర్వాత కూడా ఈ చర్చ అలాగే కొనసాగింది. తను కూడా సెటైరికల్‌గా మాట్లాడేది. ‘ఢీ’ సెట్‌లో కలిసి ట్రావెల్‌ అయిన తర్వాత తెలిసింది.. నేనే తప్పు చేశానని. సారీ చెప్పాను అన్నారు ఆది.

మోసపోయిన సందర్బం..

వచ్చిన కొత్తలో ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లతో కలిసి ఫొటోలు దిగి షేర్‌ చేస్తూ ఉండేవాడు. బహుశా ఇతను కూడా ఇండస్ట్రీకి చెందిన వాడేమోననుకున్నా. దాంతో పరిచయం పెంచుకున్నా. ‘నిన్ను ఆలీ దగ్గర లేకపోతే, సునీల్‌ దగ్గర పెడతా’ అని చెప్పేవాడు. అప్పుడప్పుడు ఫోన్‌ రీఛార్జ్‌ చేయమనేవాడు. నేను కూడా చేసేవాడిని. ఒక రోజు కలుద్దామని చెప్పాడు. వెళ్లి కలిశా. ఏవేవో కబుర్లు చెప్పాడు. పోనిలే మనల్ని ఎవరో ఒకరి దగ్గర పెడతాడని రూ.5వేలు అడిగితే ఇచ్చా. మళ్లీ నాతో మాట్లాడలేదు.

మరోసారి మోసపోయా

ఆ తర్వాత ఓ సినిమా ఆఫీస్‌కు నా ప్రొఫైల్‌ పంపిస్తే, ఛాన్సు ఇస్తానని చెప్పి రూ.10వేలు తీసుకున్నారు. మరుసటి రోజు ఆ ఆఫీస్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. డబ్బులకు పని అవదని, కేవలం టాలెంట్‌ ఉంటేనే అవకాశాలు వస్తాయని అప్పుడు తెలియదు. అలా నేను రెండుసార్లు మోసపోయా అన్నారు ఆది.

ఫ్యామిలీ గురించి చెప్పాలంటే..

నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ  హౌస్ వైఫ్. నాకు ఇద్దరు బ్రదర్స్‌. మాది మధ్యతరగతి కుటుంబం. మేము పైచదువులకు వచ్చే సమయానికి అప్పుల వల్ల ఉన్న మూడెకరాల పొలం అమ్మేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో రూ.100 కావాలన్నా పక్కింటి వాళ్లను అప్పు అడిగే పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలోనే నేను జాబ్‌ వదిలేసి ‘జబర్దస్త్‌’ ట్రయల్స్‌ మొదలు పెట్టాను. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంటే, అందరూ ఎగతాళి చేసేవారు. మళ్లీ ఆలోచనలో పడ్డా. ఏదైతే అది అయిందని, ‘జబర్దస్త్‌’లోనే  కొనసాగా. అభి అన్నవల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది.

12 స్కిట్‌ల తర్వాత నేను టీమ్‌ లీడర్‌ అయ్యాను. నన్ను ఎగతాళి చేసిన వారిపై పంతంతో విజయం సాధించా. ఏ ఊళ్లో అయితే, మూడెకరాలు అమ్ముకున్నామో అదే ఊరిలో 10 ఎకరాల పొలం కొన్నా అన్నారు  హైపర్‌ ఆది.

loader