మళ్ళీ మొదటికొచ్చిన హృతిక్, కంగనా లవ్ స్టోరీ వివాదం.. మాటల యుద్ధం..
First Published Dec 17, 2020, 2:08 PM IST
గ్రీక్ వీరుడు హృతిక్, ఫైర్ బ్రాండ్ కంగనా గతంలో ఘాటుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బ్రేకప్ చెప్పుకున్న చాలా రోజుల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. వీరి వివాదం మళ్ళీ రాజుకుంది. హృతిక్‌పై కంగనా విమర్శలు గుప్పించింది. మాటల యుద్ధం ప్రారంభమైంది.

కంగనా రనౌత్ ఈ మెయిల్ ఐడీ నుంచి తనకు వరుసగా మెయిల్స్ వస్తున్నాయని చాలా ఇబ్బందిగా ఉన్నాయని హృతిక్ సైబర్ సెల్‌కి 2016 టైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో తన ఎఫ్ఐఆర్‌ని క్రైమ్ బ్రాంచ్‌కి తరలించాల్సిందిగా హృతిక్ ఇటీవల సైబర్ సెల్‌ని కోరాడు.

దీంతో ఎఫ్‌ఐఆర్‌ని క్రైమ్ బ్రాంచ్ `క్రైమ్ ఇంటలీజెన్స్ బ్యూరోకి తరలించారు. దీంతో తాజాగా దీనిపై కంగనా స్పందించింది. గురువారం సోషల్ మీడియా ద్వారా ఆమె మాట్లాడుతూ హృతిక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?