నాని ఎంత మంది అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పాడో తెలుసా?
కొత్త కొత్త పాత్రలు చేస్తూ.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ హీరో, తన కెరీర్ లో ఎంత మంది అమ్మాయిలకు ఐ లవ్ వ్యూ చెప్పాడో తెలుసా?

రూటు మార్చిన నాని
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన నాని, అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారారు.నేచురల్ స్టార్ నాని తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈమధ్య కాలంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో కమర్షియల్‌గా, కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాని "ప్యారడైజ్" అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈసినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఈ చిత్రం 2026 మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది.
KNOW
జగపతి బాబు ఇచ్చిన సర్ప్రైజ్
ఈ నేపథ్యంలో నాని తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురాలో మూడో ఎపిసోడ్‌లో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోకు గతంలో నాగార్జున, శ్రీలీల హాజరయ్యారు. ఇప్పుడు నాని పాల్గొన్న ప్రోమో ఇప్పటికే విడుదలైర వైరల్ అవుతోంది. ఈ ప్రోమోకు మంచి స్పందన కూడా వచ్చింది. ఈ ప్రోమోలో జగపతి బాబు మాట్లాడుతూ.. “మనమిద్దరం మొదటిసారి ఎప్పుడు కలిశాం గుర్తుందా?” అని జగపతి బాబు అడిగారు, నాని వెంటనే నవ్వుతూ..“మీకు గుర్తుందా?” అని రివర్స్ ప్రశ్నించారు. దీనిపై జగపతి బాబు నవ్వుతూ, “దెబ్బతింది నేను కదా.. నాకు గుర్తుంది” అని స్పందించారు.
నాని ప్రేమ కథలు
అలాగే, నాని చిన్నప్పటి స్నేహితుడిని షోకు తీసుకువచ్చి మరో సర్ప్రైజ్ ఇచ్చారు జగపతి బాబు. ఈక్రమంలో జగపతి బాబు నానిని అడిగిన ప్రశ్నకు అంతా షాక్ అయ్యారు. “నీవెంతమందికి ఐ లవ్ యూ అన్నావు?” అనే ప్రశ్నను జగపతి బాబు అడిగినప్పుడు నాని గట్టిగా నవ్వేశారు. దీనికి నాని స్నేహితుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రోమోలో ఆ విషయం వెల్లడించలేదు. పూర్తి వివరాలు ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున, శ్రీలీల ఎపిసోడ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ముచ్చటగా మూడె ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 29న జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది.
శేఖర్ కమ్ముల తో నాని సినిమా
ఇక ప్రతీ సినిమాను డిపరెంట్ గా ప్లాన్ చేస్తూ వెళ్తున్న నాని.. తన నెక్ట్ సినిమా విషయంలో కూడా ఒక విజన్ తో ఉన్నాడు. ఇప్పటికే నాని తన తరువాత సినిమాను ఫైనల్ చేసేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడు నుంచి అందిన సమాచారం ప్రకారం, నాని ఎప్పటి నుంచో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పనిచేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫైనల్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రతి సినిమాను కొత్తగా ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్న నాని, ప్యారడైజ్‌తో పాటు శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌తో మరో విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అభిమానుల్లో ఈ రెండింటిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాని, సాయి పల్లవి కాంబోలో మూడో సినిమా
నాని శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో నానికి జోడీగా నటించబోయే నటి ఎవరు అన్నవిషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈవిషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని జోడీగా ఈ సినిమాలో సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నాని, సాయిపల్లవి కలిసి MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి), శ్యామ్ సింగ రాయ్ వంటి హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడినట్టు అవుతుతంది.