- Home
- Entertainment
- పూజా హెగ్డే నుంచి సమంత, సాయి పల్లవి వరకూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్‌కి గురైన హీరోయిన్లు.!
పూజా హెగ్డే నుంచి సమంత, సాయి పల్లవి వరకూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్‌కి గురైన హీరోయిన్లు.!
సోషల్ మీడియా ప్రస్తుతం ఒక ఆయుధంలా మారిపోయింది. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెడితే చాలు.. అది తొందరగా స్పెర్డ్ అవుతుంది. ఇక సెలబ్రిటీల్ మాట్లాడే ప్రతీ చిన్న మాట వైరల్ అవుతుంటుంది. ఇక అవే ఒక్కోసారి స్టార్స్ కు తిప్పలుతెచ్చి పెడుతుంటాయి. ఇలాగే వివాదాస్పద వాఖ్యలు చేసి... సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయబడిన హీరోయిన్ల గురించి చూస్తే...?

కొంత మంది హీరోయిన్లు.. వాళ్లు చేసిన కామెంట్ల వల్ల.. సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అయ్యారు. విపరీతంగా ట్రోల్ కు గురయ్యారు.. ఇంతకీ వాళ్ళు ఎవరో, వాళ్ళు అలా ట్రెండ్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య బాగా ట్రోలింగ్ కు గురౌతున్న హీరయిన్లలో సమంత కూడా ఉంది. నాగచైతన్యతో డివోర్స్ తరువాత.. బాగా ట్రోలింగ్ కు గురౌతోందిసామ్. రీసెంట్ గా చైతూపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంచేయిస్తుంది అంటూ.. ట్రోల్ చేస్తున్నారు చైతూ ఫ్యాన్స్. ఇక గతంలో తమిళం మనోభావాలు దెబ్బ తీసేలా సమంత పాత్ర ఉంది అంటూ సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పై గొడవ అయ్యింది. అలాగే మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా పోస్టర్ గురించి కూడా ఒక ట్వీట్ పోస్ట్ చేసి ట్రోల్ల్స్ కి గురయ్యారు సమంత.
అసలు ఇంత వరకూ వివాదం అన్న మాటే ఎరుగని హీరోయిన్ సాయి పల్లవి.. రీసెంట్ తాను మాట్లాడిన మాటలవల్ల పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీరీ ఫైల్స్ సినిమాపై మాట్లాడిన మాటలపై చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ సాయి పల్లవి ఒక వీడియో విడుదల చేశారు.
ఒ సారి వివాదాస్పద వ్యఖ్యలతో గట్టిగా ట్రోల్స్ కు గురయ్యింది పూజా హెగ్డే. సౌత్ ఇండియన్స్ కి నడుము ఫాంటసీ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే కామెంట్స్ చేయడంతో.., సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేశారు. తర్వాత పూజ హెగ్డే ఆ స్టేట్మెంట్ కి వివరణ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ట్రోలింగ్ కు గురయ్యింది ఆలియా భట్. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో అలియా భట్ సుశాంత్ ను ఉద్దేశించి అన్న ఒక మాట వైరల్ అయ్యింది. ఈ క్లిప్ తర్వాత ఆలియా భట్ ను విపరీతంగా తిట్టిపోశారు నెటిజన్లు. అంతే కాదుఅప్పట్లో ఆమె నటించిన సడక్ 2 సినిమాపై కూడా ప్రభావం చూపింది. ఒక దశలో ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా ఈ ప్రభావం పడుతంది అని అనకున్నారంతా.
మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా కాఫీ విత్ కరణ్ షోలో సుశాంత్ అంటే ఎవరు? అని అడిగినందుకు, సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో సోనమ్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. గటిగానే ట్రోల్ చేశారు సోషల్ మీడియా జనాలు.
హీరోయిన్ల బొడ్డు పై పండ్లు వేస్తారు అంటూ సౌత్ సినిమాల గురించి తాప్సీ అనడం వివాదం అయ్యింది. అంతే కాదు ఈ విషయం చెప్తూ ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు పై కామెంట్స్ చేసినందుకు నెటిజెన్స్ తాప్సిపై ఫైర్ అయ్యారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ మాత్రం పవర్ స్టార పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ద్వారా ట్రోలింగ్ కు గురయ్యింది. అప్పట్లో వకీల్ సాబ్ గురించి ట్వీట్ లో పవన్ కళ్యాణ్ గారిని సార్ అనలేదు అని అనుపమ పై ట్రోల్ల్స్ చేసారు ఫ్యాన్స్. తర్వాత సారీ అని చెప్పారు అనుపమ.