Tamannah Bhatia: బికినీ వేసిన తమన్నా... మ్యాగజైన్ కోసం తెగించిన మిల్కీ బ్యూటీ!
హీరోయిన్ తమన్నా భాటియా బికినీ ధరించారు. ఓ మ్యాగజైన్ షూట్ లో భాగంగా సూపర్ హాట్ గా తయారయ్యారు.

Tamannah Bhatia
ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ షూట్ లో తమన్నా పాల్గొన్నారు. ఈ ప్రమోషనల్ షూట్లో మిల్కీ బ్యూటీ హాట్ గ్లామర్ షోకి తెరలేపారు. ఏకంగా బికినీ వేసి అర్ధనగ్న సౌందర్యంతో కట్టిపడేసారు. ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ షూట్ ఫోటోలు తమన్నా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Tamannah Bhatia
తమన్నా ఇటీవల ఐపీఎల్ 2023 ఈవెంట్లో పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సౌత్ ఇండియా వైరల్ సాంగ్ 'టమ్ టమ్' కి మెస్మరైజింగ్ స్టెప్స్ తో క్రికెట్ అభిమానులను అలరించారు. తమన్నాతో పాటు మరో సౌత్ బ్యూటీ రష్మిక మందాన ఐపీఎల్ లాంఛింగ్ ఈవెంట్లో పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
Tamannah Bhatia
తమన్నా కెరీర్ నెమ్మదించిన దాఖలాలు లేవు. ఆమెకు ఇంకా భారీ ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. భోళా శంకర్, జైలర్ వంటి బడా హీరోల చిత్రాల్లో తమన్నా నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు.
Tamannah Bhatia
కెరీర్లో మొదటిసారి తమన్నా రజనీకాంత్ కి జంటగా నటిస్తున్నారు. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం.
Tamannah Bhatia
ఇటీవల తమన్నా మీద ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వాదనలు తెరపైకి వచ్చాయి.
Tamannah Bhatia
విజయ్ వర్మతో డేటింగ్ వార్తలను తమన్నా ఖండించారు. వినడానికి చాలా సిల్లీగా ఉందంటూ సింపుల్ గా కొట్టిపారేశారు. నేను ఎవరితో రిలేషన్ లో లేను. పెళ్లి కుదిరినప్పుడు నేనే స్వయంగా చెబుతానంటూ స్పష్టత ఇచ్చింది.
Tamannah Bhatia
'శ్రీ' మూవీతో తమన్నా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమెకు హ్యాపీ డేస్ బ్రేక్ ఇచ్చింది. 100 % మూవీతో ఫేమ్ తెచ్చుకుంది. చిరంజీవి, వెంకీ వంటి సీనియర్ హీరోలతో జతకట్టిన తమన్నా... ఈ తరం టాప్ స్టార్స్ అందరినీ కవర్ చేసింది.
Tamannah Bhatia
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.భోళా శంకర్, జైలర్ తో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో తమన్నా నటిస్తున్నారు. భోళా శంకర్ మూవీపై అంచనాలు ఉన్న నేపథ్యంలో తమన్నా కెరీర్ కి ఆ మూవీ మరింత ప్లస్ అయ్యే సూచనలు కలవు.