హీరోయిన్ గా సురేఖా వాణి కూతురు, హింట్ ఇచ్చేసిన యంగ్ బ్యూటీ... ఇక సిల్వర్ స్క్రీన్ పై రచ్చ రచ్చే
నటి సురేఖా వాణి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై యంగ్ బ్యూటీ సుప్రీత స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది.
సురేఖా వ్ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో సుప్రీతకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తరచుగా తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది.
సురేఖా వాణి ఒక ప్లాన్ ప్రకారం సుప్రీతను కూడా పాప్యులర్ చేసింది. సుప్రీత టీనేజ్ లో ఉన్నప్పటి నుండే కలిసి వీడియోలు, ఫోటో షూట్స్ చేసేది. సురేఖా వాణి-సుప్రీత ట్రెండీ బట్టల్లో డాన్సు వీడియోలు చేసేవారు. అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఈ తల్లీ కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు. టూర్స్, వెకేషన్స్ కి కలిసి వెళతారు. పార్టీలు పబ్ లు ఎంజాయ్ చేస్తారు. కూతురు సుప్రీత నోట్లో స్వయంగా మద్యం పోస్తున్న ఫోటో ఆ మధ్య వైరల్ అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి మధ్య ఉండే బాండింగ్ ఏమిటో...
సుప్రీతను హీరోయిన్ చేయాలని సురేఖా వాణి ప్రయత్నాలు చేస్తుందనే పుకార్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఆమె కల నెరవేరినట్లు ఉంది. సుప్రీత త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై సుప్రీత స్వయంగా క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సుప్రీత ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. ఓ అభిమాని... మీరు సినిమాల్లో నటించండి. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశగా ఉంది, అంటూ కోరిక బయటపెట్టాడు. దానికి సమాధానంగా సూన్ అని సుప్రీత కామెంట్ పెట్టింది.
అంటే సుప్రీత హీరోయిన్ గా మూవీ కన్ఫర్మ్ అయ్యింది. త్వరలో వివరాలు తెలియనున్నాయని క్లారిటీ వచ్చింది. కాబట్టి సురేఖా వాణి కూతురు త్వరలో వెండితెర మీద సందడి చేయనుంది. అయితే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం అంత సులభం కాదు. సుప్రీత ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి...