టాప్ హీరోయిన్స్ సమంత, రష్మికలకు శృతి హాసన్ ఊహించని దెబ్బ... ఇది అరుదైన ఫీట్!
దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న శృతి హాసన్ అనూహ్యంగా పుంజుకుంది. బహుశా మిరాకిల్ అంటే ఇదేనేమో. 2023లో టాలీవుడ్ లో శృతి హాసన్ హవా సాగింది.

Shruti Haasan
శృతి హాసన్ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. బిగినింగ్ లో వరుస ప్లాప్స్. ఐరన్ లెగ్ ఇమేజ్. ఆ టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ ఆమె కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ కెరీర్ ఊపందుకుంది. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్సులు పట్టేసింది.
కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి హాసన్ ప్రేమలో పడింది. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో చెట్టపట్టాలేసుకుని తిరిగింది. లండన్ లో ఉంటూ సినిమాలు చేయడం మానేసింది. 2017 తర్వాత శృతి హాసన్ మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. మైఖేల్ బ్రేకప్ చెప్పడంతో ఇండియా వచ్చి మరలా యాక్టింగ్ పై దృష్టి పెట్టింది.
కిక్ తో కమ్ బ్యాక్ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని-రవితేజ కాంబోలో తెరకెక్కిన కిక్ సూపర్ హిట్. శృతి హాసన్ ని జనాలు గుర్తు చేసుకున్నారు. వకీల్ సాబ్ చిత్రంలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. అది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. 2021లో కిక్, వకీల్ సాబ్ తో రెండు విజయాలు ఖాతాలో వేసుకుంది.
ఇక 2023 ఆమెకు గోల్డెన్ ఇయర్. సంక్రాంతి హీరోయిన్ గా సత్తా చాటింది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్. గతంలో సిమ్రాన్ చిరంజీవి, బాలయ్య సంక్రాంతి చిత్రాల్లో నటించింది. 2001లో విడుదలైన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కాగా, మృగరాజు ప్లాప్ అయ్యింది. శృతి హాసన్ నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండూ హిట్ అయ్యాయి.
Shruti Haasan
ఇది అరుదైన ఫీట్. హాయ్ నాన్న మూవీలో శృతి హాసన్ ఐటెం సాంగ్ చేసింది. హాయ్ నాన్న ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడాది చివర్లో సలార్ తో శృతి హాసన్ మరొక భారీ విజయం ఖాతాలో వేసుకుంది. సలార్ ఫస్ట్ డే రూ. 178.7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. 2023కి గానూ అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది.
Rashmika Mandanna
సలార్ జోరు చూస్తుంటే వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అనిపిస్తుంది. అసలు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కూడా లేని శృతి హాసన్ సమంత, రష్మిక మందానకు షాక్ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలం డిజాస్టర్ కాగా, ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.
Samantha
ఇక రష్మిక మందాన విషయానికి వస్తే... వారసుడు యావరేజ్, మిషన్ మజ్ను ప్లాప్ అయ్యింది. యానిమల్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కాబట్టి టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న రష్మిక, సమంతలకు రేసులో లేని శృతి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. విచిత్రం అంటే ఇదే...