MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయనలోని ఆ రెండు విషయాలు బాగా ఇష్టం, నేను కూడా నేర్చుకున్నాను... శృతి ఓపెన్ కామెంట్స్ 

ఆయనలోని ఆ రెండు విషయాలు బాగా ఇష్టం, నేను కూడా నేర్చుకున్నాను... శృతి ఓపెన్ కామెంట్స్ 

బ్రతికితే శృతి హాసన్ లా బ్రతకాలి. సొసైటీ, రూల్స్ అనేవి పట్టించుకోకుండా స్వేచ్ఛా జీవితం అనుభవించాలి. లేడీ రామ్ గోపాల్ వర్మలా తయారైంది శృతి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 28 2022, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కమల్ హాసన్ వారసురాలు శృతి హాసన్ లైఫ్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమెది అంతా ఫారిన్ కల్చర్. రిలేషన్స్, ఎఫైర్స్ గట్రా ఓపెన్ గా పెట్టుకుంటుంది. అందులో ఎలాంటి దాపరికం ఉండదు. కొన్నాళ్ళు లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే అనే వ్యక్తితో శృతి ఎఫైర్ నడిపింది. అతడితో సహజీవనం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మైఖేల్ కోసం శృతి కెరీర్ కూడా వదిలేసింది. 2017 తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దాదాపు రెండేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అంత ఘాడంగా మైఖేల్ ని లవ్ చేసింది. అనూహ్యంగా 2019లో ఈ జంట విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పుకున్నారు. 

38
Shruti Haasan

Shruti Haasan


కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న శృతి 2020లో మరో రిలేషన్ స్టార్ట్ చేసింది. ఈసారి ముంబైలో ఉండే డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికను ఎంచుకుంది. రెండున్నరేళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది. శాంతనుతో దిగిన ఫోటోలు,వీడియోలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 
 

48
Shruti Haasan

Shruti Haasan


తాజాగా శృతి శాంతనుతో రిలేషన్ పై స్పష్టమైన అవగాహన ఇచ్చింది. ఫ్యాన్స్ తో శాంతను గురించి విశేషాలు పంచుకుంది. శృతి మాట్లాడుతూ... శాంతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాగే దయ కలిగిన వ్యక్తి. అతనిలోని ఈ రెండు లక్షణాలు నాకు చాలా ఇష్టం. శాంతను కారణంగా నేను మారిపోయాను. అతనిలో ఉన్న ఈ మంచి అలవాట్లు నేను కూడా అలవరుచుకుంటున్నాను. 

58


శాంతను నాకు బెస్ట్ ఫ్రెండ్. అతనితోనే నేను కలిసి ఉంటున్నాను. శాంతను నన్ను సంతోషంగా ఉంచుతాడు. ఎప్పుడూ నాతోనే ఉంటాడు. ఇక సోషల్ మీడియా కామెంట్స్ ఇద్దరం కలిసి చుదువుతాం. ఆ కామెంట్స్ చదువుతుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అది మేము ఎంజాయ్ చేస్తాము... అని శృతి చెప్పుకొచ్చారు. శాంతను రిలేషన్ తనకు మంచి అనుభూతిని ఇస్తుందని శృతి చెప్పకనే చెప్పింది. 

68

కాగా శృతి హాసన్(Shruti Haasan) కెరీర్ మరలా పుంజుకుంది. సొంత పరిశ్రమ తమిళంలో ఆఫర్స్ తగ్గినప్పటికీ తెలుగులో ఆమె బిజీ అయ్యారు. ఏకంగా మూడు భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సలార్ షూటింగ్ జరుపుకుంటుంది. 
 

78

శృతి 2023 సంక్రాంతి హీరోయిన్ కానుంది. చిరంజీవి(Chiranjeevi), బాలయ్యల పండగ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. గతంలో అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు.

88

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) చిత్రాల్లో హీరోయిన్ గా ఉన్న శృతి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సరసన చేరారు. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక శృతి చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ సలార్. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సలార్ (Salaar)విజయం సాధిస్తే శృతి కెరీర్ కి మరింత ప్లస్ అవుతుంది.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
Recommended image2
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Recommended image3
Chiranjeevi: ఆ హీరో కోసం తమ్ముడి సినిమానే పక్కన పెట్టిన చిరు, దెబ్బకు ఫ్లాప్ కావాల్సిన మూవీ బిగ్గెస్ట్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved